పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఆ సినిమా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ విజువల్ వండర్ ను క్రియేట్ చేశాయి.. అద్భుతమైన సన్నివేశాలను, భారీ యాక్షన్ సన్ని వేశాలను ట్రైలర్ లో చూపించారు.. నిన్న విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.. ఇదిలా ఉండగా ఈ సినిమా టికెట్ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..
కల్కి సినిమా కోసం నైజాంలో టికెట్ రేట్లు పెంచిన తర్వాత ధరలపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చింది. ఏఎంబీ మాల్ లాంటి లగ్జరీ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర దాదాపు 500 రూపాయలకు చేరుకోగా.. మిగిలిన మల్టీప్లెక్సుల్లో అటుఇటుగా 430 నుంచి 470 వరకు ఉంటుందని తెలుస్తుంది. అటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా టికెట్ ధరలు భారీగా పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయం క్లారిటీ వచ్చేసింది.. ఏపీలో ఒక్కో టిక్కెట్ పై సింగిల్ స్క్రీన్స్ లో రేట్లు కూడా టికెట్ పై 75 రూపాయల చొప్పున పెరిగాయి.. అలాగే మల్టీ ఫ్లెక్స్ లో 125 రూపాయలు చొప్పున పెరిగినట్లు తెలుస్తుంది..
ఏపీ, తెలంగాణానే కాదు ప్రతి ప్రాంతంలోనూ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. ఈ ధరలు రెండు వారాల పాటుగా కొనసాగానున్నాయని తెలుస్తుంది.. ఆ తర్వాత టిక్కెట్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాలో అమితాబ్, మృణాల్ కు సంబందించిన కొన్ని అద్భుతమైన సీన్లు హైలెట్ గా నిలిచాయి.. విజువల్స్ మాత్రం ఓ రేంజులో ఉన్నాయి.. డైరెక్టర్ కష్టం ఇందులో కనిపిస్తుంది.. ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే భారీ వ్యూస్ లైకులతో దుమ్ము దులిపేస్తుంది.. సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..