Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gutkha, Pan Masala Ban: ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గుట్కా, పాన్ మసాలా, పొగాకు, నికోటిన్ కలిగిన ఇతర ఆహార ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. 2026 అక్టోబర్ 13 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఏ పేరుతో విక్రయించినా నిషేధిత ఉత్పత్తులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ ఆహార భద్రత, ఔషధ పరిపాలన కమిషనర్ వినయ్ శంకర్ పాండే మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006లోని సెక్షన్ 26తో పాటు సెక్షన్ 92, సెక్షన్ 30(2) కింద కల్పించిన అధికారాలను వినియోగించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గతంలోనూ పలుమార్లు నిషేధం
ఉత్తరాఖండ్‌లో గుట్కా, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై నిషేధం విధించడం ఇదే తొలిసారి కాదు. ప్రభుత్వం 2013లోనే ఈ ఉత్పత్తులపై ఆంక్షలు విధించింది. ఆ తర్వాత 2015, 2019లోనూ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసి నిషేధాన్ని కొనసాగించింది. అయినప్పటికీ, ఈ ఉత్పత్తుల వినియోగం కొనసాగుతుండటంతో ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలకు ఉపక్రమించింది.
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
చట్టం ఉన్నా కొనసాగుతున్న వినియోగం
ఆహార భద్రత, ప్రమాణాల (అమ్మకాలపై నిషేధం, పరిమితులు) నిబంధనలు–2011లోని నిబంధన 2.3.4 ప్రకారం, ఆహార ఉత్పత్తుల్లో పొగాకు, నికోటిన్‌ను పదార్థాలుగా ఉపయోగించడం నిషేధం. అయినప్పటికీ, గుట్కా, పాన్ మసాలా వంటి ఉత్పత్తుల్లో వీటి వినియోగం కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో నిషేధిత ఉత్పత్తుల తయారీ నుంచి విక్రయాల వరకు అన్ని దశలపై ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడటం, పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!