Vishwak Sen Counter to trollers trolling about his speech: టాలీవుడ్ యంగ్ హీరోలలో విశ్వక్సేన్ కూడా ఒకరు. ఫలక్నామా దాస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఫలక్నామా దాస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు అప్పట్లో చేశారు. ఇప్పటికే ఒకడిని లేపాము ఇప్పుడు మరొకడు వచ్చాడు అని అనుకుంటున్నారు. కానీ నన్ను ఎవరూ లేపాల్సిన అవసరం లేదు. నన్ను నేనే లేపుకుంటానని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. వాళ్ళు ఆసక్తికరమైన సినిమాలు చేస్తూ ఈ మధ్యనే గామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక ప్రయోగాత్మకమైన సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ కూడా మంచిగానే వస్తున్నాయి. ఇంకా సినిమాని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఆంధ్రలోని కొన్ని ప్రాంతాలకు వెళుతున్నారు సినిమా యూనిట్. అందులో భాగంగా తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సమయంలో ఎవరైనా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నలుగురు పెద్దలు సినిమాని చూసి బాగుందని చెబితే ఇంకా పుష్ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు విశ్వక్.
Pawan Kalyan: సినిమాలు చేసుకుందాం అంటే.. మీ అభిమానమే నాకు శాపం అయ్యింది..!
ఈ క్రమంలో పాత లేపుడు వీడియోని, కొత్త నలుగురు పెద్దలు అనే వీడియోని అటాచ్ చేసి విశ్వక్ మాట మార్చాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ట్రోల్స్ గురించి తాజాగా విశ్వక్సేన్ స్పందిస్తూ ఒక పోస్ట్ షేర్ చేశాడు. ఎవరైతే ఆ పాత వీడియో గురించి ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పేది ఒకటే. సినిమా రిలీజ్ కి ముందు అడిగితే లేపమని సపోర్ట్ చేయమని కానీ సినిమా హిట్ అయ్యి ప్రాఫిట్ జోన్ లో పడ్డాక చూడమంటే గుర్తించమని. ఈ సినిమాలో నేను తప్ప ప్రతి టెక్నీషియన్ కొత్తవాడు. వాళ్లకి అభినందనలు దక్కాలి అంతే నేను చెప్పాలనుకున్న ఉద్దేశం. అలాగే నేను మరోసారి అదే చెబుతున్నాను, ఇది కేవలం గామీ ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ఇది తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమా. అలాగే మీకు కావాల్సిన కమర్షియల్ కిక్ ఎలా ఉంటది అనేది ఇప్పుడు నుంచి చూడండి అని పేర్కొన్న విశ్వక్సేన్ అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అంటూ ఆయన రాసుకొచ్చారు.
— VishwakSen (@VishwakSenActor) March 14, 2024