Site icon NTV Telugu

CM Yogi: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం యోగి.. ముస్లిం సోదరులకు కీలక సందేశం..!

Cm Yogi

Cm Yogi

ఈద్-ఉల్-అఝా(బక్రీద్) పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లి సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగం, అంకితభావం, అల్లాహ్‌పై అచంచల విశ్వాసానికి ప్రతీక అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈద్-ఉల్-అఝా పండుగ మనం కలిసి జీవించడానికి, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పండుగ పరస్పర సోదరభావాన్ని పెంపొందించడానికి, సమాజంలో ప్రేమ, కరుణ, త్యాగ స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఒక అవకాశమని స్పష్టం చేశారు. యోగి ఆదిత్యనాథ్ శాంతి, సామరస్యంతో.. నియమాలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. పండుగ సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, పరిశుభ్రత వ్యవస్థ సజావుగా నిర్వహించాలని పరిపాలనను ఆదేశించారు.

READ MORE: Naslen : మ‌ల‌యాళ చిత్రం ‘అల‌ప్పుళ జింఖానా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..

ముస్లింల ప్రధాన పండగలు రెండు ఒకటి రంజాన్ రెండవది బక్రీద్. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం చాంద్రమానం ఆధారంగా బక్రీద్ పండుగను నిర్ణయిస్తారు. రంజాను మాసం ముగిసిన 70 రోజుల తర్వాత బక్రీద్ పండుగ వస్తుంది. బక్రీద్ పండుగలో ఖుర్బానీకి ఎంతో విశిష్టత ఉంది. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి, అక్కడే నివాసం ఉంటారు. అల్లాహ్‌ను ఆరాధించడానికి ప్రార్థనా మందరి కాబా’నిర్మించి దైవ ప్రవక్తగా పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. అయితే ఇబ్రహీం దంపతులు ఎంతో కాలం తర్వాత ఓ బిడ్డకు జన్మినిస్తారు. తనకు ఇస్మాయిల్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే ఓ రోజు ఇబ్రహీంకు కలలో తన కుమారుడిని చంపుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో అల్లాహ్ ఖుర్బానీ కోరుతున్నాడేమో అని భావించి ఒంటెను బలి ఇస్తారు.

READ MORE: Virat Kohli In Trouble: విరాట్ కోహ్లీపై ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

Exit mobile version