ఈద్-ఉల్-అఝా(బక్రీద్) పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లి సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగం, అంకితభావం, అల్లాహ్‌పై అచంచల విశ్వాసానికి ప్రతీక అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈద్-ఉల్-అఝా పండుగ మనం కలిసి జీవించడానికి, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండగ జరుపుకుంటారని.. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో చేసుకునే బక్రీద్ అని.. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరారు..