తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికల మాత్రం తర్జనభర్జన పడుతుంది. అయితే, సీఎం రేసులో ఉన్న మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా.. నేను కాంగ్రెస్ పార్టీ తరపున 7 సార్లు గెలిచానని అన్నారు.. పార్టీని ఎప్పుడూ వీడలేదు.. బయట నుంచి రాలేదు అంటూ ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.. కానీ మేము ఆశించిన స్థాయిలో గెలవలేకపోయామని చెప్పుకొచ్చారు.
Read Also: Chiranjeevi: చిరు సరసన సీత.. శ్రీదేవిని మించి ఉండబోతుందంట.. ?
నేను పీసీసీగా ఉన్నప్పుడు ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై ఇంత వ్యతిరేక లేకపోవడంతో పాటు మరోసారి కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు అందుకే.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ రాలేదు.. ప్రతి ఎన్నికలకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి.. కానీ, ఇప్పుడు పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించాము.. సీఎం అభ్యర్థి నిర్ణయంపై తన డిసిషన్ ను హైకమాండ్ కు చెప్పాను.. పార్టీ పెద్దలను కలిసి చెప్పాల్సింది చెప్పాను అని ఆయన వెల్లడించారు. అయితే, పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీకి వచ్చాను.. నేను, నా భార్య ఎప్పుడూ క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉండి పని చేస్తాం.. తెలంగాణ ప్రజల గుండెల్లో గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Read Also: Chandrababu: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు.. తుఫాన్ సహాయక చర్యలు చేపట్టండి
ఇక, నేను పీసీసీ ప్రెసిడెంట్ కాదు కాబట్టి ఆ స్థాయిలో ప్రచారం చేయలేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నాకిచ్చిన పని చేశాను.. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాను.. పార్టీ విధేయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో వాష్ అవుట్ అయ్యాం.. హైదరాబాద్ లో ఇలాంటి ఫలితం వస్తుందని అనుకోలేదు.. సీఎం ఎంపికలో ఎలాంటి తాత్సారం జరగలేదు.. ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా దాటలేదు అని ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.