Anasuya Bharadwaj Releases a video clarification on her crying video: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ భరద్వాజ్ ఏడుస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం పెద్ద కలకలానికి దారి తీసింది. కొన్నాళ్ళ క్రితం ఒక హీరో అభిమానులతో వివాదం పెట్టుకుని ఎవరికి టార్గెట్ గా మారిన అనసూయ అదే విషయాన్ని బాధపడుతూ ఇప్పుడు వీడియోలో పోస్ట్ చేసిందని చాలా మంది భావించారు. అనేక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అనసూయ సోషల్ మీడియాలో నెగిటివిటీ భరించలేక ఇలా ఏడుస్తుందంటూ ఆమె వీడియోని షేర్ చేశారు. అయితే అది నిజం కాదని తాను రాసింది మీరు సరిగ్గా చదవలేదని ఆమె మరో వీడియో రిలీజ్ చేసింది.
Sreeleela: రష్మిక బిజీ షెడ్యూల్ శ్రీలీలకి కలిసొచ్చింది
తను ఈ వీడియో షేర్ చేసి సెలూన్ కి వెళ్లి రెడీ అయి వచ్చే లోపు ఇంత రచ్చ జరిదిందని చెబుతూ అరేయ్ ఏంట్రా మీరంతా అంటూ కొన్ని సందర్భాల్లో ఏడవ వలసి వస్తుందని అయితే నేను ఏడిస్తే ఎవరేమనుకుంటారో అని ఉండిపోకుండా బాధ కలిగినప్పుడు మనసారా ఏడ్చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ పని మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ వీడియో షేర్ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే దాన్ని తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియా నెగిటివిటీ వల్ల తాను ఏడుస్తూ వీడియో పెట్టానని అనుకుంటున్నారని అది కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా నెగిటివిటీ వల్ల తాను బాధపడుతున్న మాట వాస్తవమే కానీ ఆ విషయంలో అయితే వారికి ఎదురు వెళ్లి పోరాడుతాను తప్ప ఆ విషయంలో ఏడ్చే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆమె రాసుకొచ్చింది.
\