Uttam Kumar Reddy: హరీష్ మాటలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్‌కు చులకనభావం.. చట్టసభలు, న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారధ్యంలో నియమించిన జ్యుడిషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ వాళ్లలో మార్పు రాలేదని.. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పుకోవాలనే సోయి కూడా లేకపోయిందన్నారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఎన్డీఎస్‌ఏ మీద నమ్మకం లేదని.. మేడిగడ్డ ను కుంగబెట్టిన దుర్మార్గులు ఇప్పడు ఏకంగా సీనియర్ జస్టిస్ పీసి ఘోష్ ను అవమానిస్తున్నారా..? అని ప్రశ్నించారు.
READ MORE: HYD Bava Murder: బావమర్దులు.. బావ బతుకు కోరతారు.. కానీ హైదరాబాద్‌లో ఓ బావ బలి కోరారు
“ఫార్మ్ హౌజ్ లో మామ డైరెక్షన్, పార్టీ ఆఫీస్ లో అల్లుడి యాక్టింగ్ ఇకనైనా ఆపాలి. అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులు ఒప్పుకొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాలి. నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పండి. మోసగాళ్లకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ వాళ్లలో మార్పు రాలేదు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పుకోవాలనే సోయి కూడా లేకపోయింది. కమిషన్ విచారణ తో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు భండారం బట్టబయలైంది. తేలు కుట్టిన దొంగల్లా.. హరీష్ రావు మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు. మేమేం తప్పు చేయలేదని మీ పార్టీ ఆఫీసులో తప్పులు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు. చర్యలు తీసుకుంటాం అనే భయం వాళ్లను వెంటాడుతోంది.” అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: Israel Gaza War: ఇజ్రాయెల్ బాస్ కొత్త ప్లాన్.. అంగీకరించకపోతే రాజీనామే గతి..!
