హరీష్ మాటలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్‌కు చులకనభావం.. చట్టసభలు, న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారధ్యంలో నియమించిన జ్యుడిషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదన్నారు.