పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తిచేశామని బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమని.. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని.. రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తట్టెడు మట్టి కూడా తీయలేదు కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. నీటి వాటాలపై తెలంగాణ అసెంబ్లీలో రేపు చర్చ జరగనున్న దృష్ట్యా.. ‘నీళ్లు-నిజాలు’ అంశంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం మంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
Also Read: Anam Ramnarayana Reddy: నచ్చితే ఎంత?, నచ్చకపోతే ఎంత?.. కేసీఆర్‌పై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు!
‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తిచేశామని బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తట్టెడు మట్టి కూడా తీయలేదు కేసీఆర్ అన్నారు. 2015లో జీవో ఇచ్చారు. రూ.35 వేల కోట్లు అంచనా వ్యయం ఇచ్చారు, రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పూర్తవ్వాలంటే రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతుంది. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పూర్తిచేశాం అంటే ఎలా?. ఆయకట్టు కాలువలకు అయ్యే వర్క్ కాస్ట్ కూడా లెక్క వేయలేదు. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఎకరాకి కూడా నీళ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా.. రూ.7 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సహా ఇతర పథకాలపై కూడా మంత్రి ఉత్తమ్ వివరణ ఇచ్చారు.
