Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Uttam Kumar Reddy About Kaleshwaram Project Committee

Uttam Kumar Reddy : 6న కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రాక

Published Date :March 3, 2024 , 7:52 pm
By Gogikar Sai Krishna
Uttam Kumar Reddy : 6న కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రాక
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో మేడిగడ్డ పిల్లర్‌ ఘటన దీనికి మరింత బలాన్ని చేకూర్చుతుండగా.. కాళేశ్వరం నిర్మాణంపై విచారణ జరపాలని బీజేపీ సైతం కోరుతోంది. ఈ క్రమంలోనే.. 6వ తేదీన కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రానున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నాం.. అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. నేషనల్ డ్యామ్ సెఫిటీ అథారిటీ సూచనలను ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. గతంలో కుంగిపోయిన మెడిగడ్డ బ్యారేజ్ ను నేషనల్ డ్యామ్ సెఫిటీ అథారిటీ పరిశీలించి నీటిని ఖాళీ చేయాలని సూచించిందని, అనంతరం సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్ లను పరిశీలించిన డ్యామ్ సెఫిటీ అథారిటీ మెడిగడ్డ లో ఉన్న సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయని ఈ రెండు బ్యారేజ్ లలో కూడా నీటిని ఖాళీ చేయాలని సూచించింది. అథారిటీ సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం నీటిని ఖాళీ చేస్తుందన్నారు.

అంతేకాకుండా..’ ఈ విషయంలో బిఆర్ఎస్ రాజకీయాలు చేస్తూ నీటిని నింపాలని డిమాండ్ చెయ్యడం అత్యంత బాధ్యత రాహిత్యం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ సారధ్యంలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో యు.సి. విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఫియర్లు కుంగిపోవటంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. మూడు బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల అధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్ఏ విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ మూడు బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ మార్చి 2వ తేదీ శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది.

బ్యారేజీలను పరిశీలించి, కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని ఈ కమిటీకి సూచించింది. నాలుగు నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది. బీఆర్ఎస్ నాయకులకు ఎలాంటి సాంకేతిక అవగాహన లేకున్నా మాట్లాడడం దురదృష్టకరం.. కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్లు, అన్ని విషయాలల్లో గత ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది. 94 వేల కోట్ల వ్యయం చేసిన ఈ ప్రాజెక్టులో మెడిగడ్డ బ్యారేజ్ గుండెకాయ లాంటిది.. బీఆర్ఎస్ నాయకుల మాటలకు విలువ లేదు.. కాళేశ్వరం ప్రాజెక్టు లో గుండెకాయ లాంటి మెడిగడ్డ కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయాల్సిన బిఆర్ఎస్ నాయకులు ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడ్డం అత్యంత దురదృష్టకరం.. బీఆర్ఎస్ నాయకులు బాద్యత రహితంగా రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను, రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టడం దురదృష్టకారం.. రాష్ట్ర ప్రభుత్వం డ్యామ్ సెఫిటీ అథారిటీ, నిపుణుల కమిటీ సూచనలను మాత్రమే పాటిస్తుంది.’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • Kaleshwaram project
  • latest news
  • telugu news
  • uttam kumar reddy

తాజావార్తలు

  • Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం

  • Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?

  • Women reservation bill: ఓడి గెలిచిన బీజేపీ.. గెలిచి ఓడిన కాంగ్రెస్..!

  • GT vs KKR: బ్యాటు ఝుళిపించిన కామెరూన్ గ్రీన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

  • Fish Pickle: చేపల పచ్చడి నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్‌గా కుదరాలా.. అయితే సింపుల్‌గా ఇలా చేయండి!

ట్రెండింగ్‌

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!

  • Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions