Credit Card Limit: క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తం వాడేస్తున్నారా? సిబిల్ పై ప్రభావం పక్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చాక ఏటీఎంలకు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేయాల్సిన అవసరం దాదాపు తగ్గిపోయింది. దీంతో చాలా మంది డెబిట్ కార్డులను వాడటం మానేశారు. ఏదో అప్పుడప్పుడు ఆన్ లైన్ షాపింగ్ లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే డెబిట్ కార్డు వాడకం ఎంత తగ్గిందో కెడ్రిట్ కార్డు వినియోగం అంత పెరిగింది. బ్యాంక్ లు కస్టమర్లను ఆకర్షించేలా వీటిపై అనేక ఆఫర్లను ఇవ్వడం కూడా వీటి వినియోగానికి కారమవుతున్నాయి. ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ, స్పెండింగ్ని ట్రాక్ చేయడంలో కెడ్రిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
తమ నెలవారీ ఖర్చులకు వీటిని చాలా మంది వినియోగిస్తున్నారు. కొందరైతే తమ ఖర్చుల కోసం పూర్తిగా క్రెడిట్ లిమిట్ మొత్తం ఉపయోగిస్తుంటారు. అయితే జీతం రాగానే మొత్తం బకాయిని కట్టేసి మళ్లీ క్రెడిట్ కార్డు లిమిట్ మొత్తం ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా పదేపదే చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక క్రమశిక్షణ తప్పే ప్రమాదం ఉంది. మీరు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఇది మీ సిబిల్ స్కోర్ పై కూడా ప్రభావం చూపిందని గుర్తుంచుకోండి
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
క్రెడిట్ యుటిలైజేషన్ రేట్
క్రెడిట్ కార్డు స్కోర్ పైనే బ్యాంక్ ల నుంచి పొందే రుణాలు, వాటిపై విధించే వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. అయితే మంచి సిబిల్ స్కోర్ కోసం హెల్తీ క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ మెయింటెన్(CUR) చేయాలి. అసలు ఏంటి ఈ క్రెడిట్ యుటిలైజేషన్ రేట్ అనుకుంటున్నారా? మనం క్రెడిట్ కార్డును ఎలా, ఎంత వరకు ఉపయోగిస్తున్నామనన్నది తెలిపేదే ఈ క్రెడిట్ యుటిలైజేషన్ రేట్. సాధారణంగా ఈ రేటు మనకు ఇచ్చిన క్రెడిట్ కార్డు స్మెండింగ్ లిమిట్ లో 30 శాతం కంటే తక్కువగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక CUR అంటే అర్థం ఏంటంటే మీరు క్రెడిట్ లిమిట్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అర్థం.
Also Read: Diesel instead of Petrol: కారులో పెట్రోల్ బదులు డీజిల్ కొట్టించారా? ఇలా చేయండి
ఇలాంటి సందర్భంలో మీరు బకాయిలను డ్యూ డేట్ కంటే ముందే చెల్లిస్తున్నప్పటికీ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగానే ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే మీకు లోన్ పొందటం కష్టం కావడమే కాకుండా మీ కార్డు లిమిట్ పెంచుకొనే అవకాశం కూడా ఉండదు. అంతేకాకండా మీరు ఒక్కనెల బిల్లును చెల్లించడంలో ఆలస్యం చేసిన అది ఆర్థికంగా భారంగా మారొచ్చు. మీరు మినిమమ్ బ్యాలెన్స్ కట్టినప్పటికీ మీరు కట్టాల్సిన బకాయిలో తేడా రాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి కాబట్టి కార్డు ఉపయోగించి ఖర్చు చేసే ముందే ఆలోచించండి.
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..