US Venezuela Tensions: అమెరికా తన విమాన వాహక నౌకను కరేబియన్‌కు మోహరించింది. వెనిజులాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య యూఎస్ ఈ చర్యను తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కరేబియన్ ప్రాంతంలో యూఎస్ సైనిక ఉనికిని పెంచారు. ఈ చర్య ఇప్పటి వరకు జరిగిన అన్ని మాదకద్రవ్యాల వ్యతిరేక మిషన్ కంటే చాలా పెద్దదిగా చెబుతున్నారు. ఇప్పటి వరకు వాషింగ్టన్ తీసుకున్న అత్యంత శక్తివంతమైన సైనిక చర్యగా దీనిని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: BSF Constable GD Recruitment 2025: 10th అర్హతతో కానిస్టేబుల్ అయ్యే ఛాన్స్.. మిస్ చేసుకోకండి
ట్రంప్ ప్లానే..
కరేబియన్‌లో యూఎస్ సైనిక ఉనికిని పెంచుకోవాలనే డోనాల్డ్ ట్రంప్ ప్రణాళికలో భాగంగా తాజాగా ఈ మోహరింపు జరిగిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మోహరింపులో ఎనిమిది అదనపు యుద్ధనౌకలు, ఒక అణు జలాంతర్గామి, F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. అమెరికా చర్యలతో ఈ ప్రాంతంలో ఆందోళనలు పెరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు. నికోలస్ మదురో నేతృత్వంలోని వెనిజులా ప్రభుత్వం మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులకు ఆశ్రయం కల్పిస్తోందని, అలాగే దేశంలో ప్రజాస్వామ్య సంస్థలను అణగదొక్కిందని ట్రంప్ పరిపాలన చాలా కాలంగా ఆరోపిస్తోంది.
తాజాగా చర్యలపై పెంటగాన్ ఏం చెప్పింది..
“USS SOUTHCOM ప్రాంతంలో పెరిగిన US సైనిక ఉనికి అమెరికా భద్రతకు, పశ్చిమ అర్ధగోళ స్థిరత్వానికి ముప్పు కలిగించే అక్రమ కార్యకలాపాలను గుర్తించడం, నిరోధించడం, తొలగించడంలో ఉపయోగపడుతుంది” అని పెంటగాన్ ప్రతినిధి సీన్ పెర్నెల్ X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. విమాన వాహక నౌక లాటిన్ అమెరికాలో ఎప్పుడు వస్తుందో ఆయన ఇందులో వెల్లడించలేదు.
USS జెరాల్డ్ ఫోర్డ్‌లో 75 యుద్ధ విమానాలు..
2017లో కమిషన్ చేసిన USS గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా సరికొత్త, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక. ఇందులో 5 వేల కంటే ఎక్కువ మంది నావికులు ఉంటారు. అలాగే ఇది ఏకకాలంలో 75 యుద్ధ విమానాలను మోసుకెళ్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ ప్రారంభం నుంచి US సైన్యం కరేబియన్ సముద్రంలో మాదకద్రవ్యాల నౌకలపై 10 వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు 40 మంది మరణించినట్లు సమాచారం. ఈ దాడులకు సంబంధించిన పెంటగాన్ చాలా తక్కువ సమాచారాన్ని అందించింది. కానీ ఈ దాడుల్లో మృతి చెందిన వారిలో కొందరు వెనిజులా వాసులు అని మాత్రం నిర్ధారించింది. ఈ దాడుల తర్వాత వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తనను దేశంలో అధికారం నుంచి తొలగించడానికి అమెరికా కుట్ర పన్నుతోందని పదే పదే ఆరోపించారు.
ఇదే సమయంలో ఆగస్టులో వాషింగ్టన్ మదురోకు షాక్ ఇచ్చింది. మదురో అరెస్టుకు సమాచారం ఇచ్చిన వారికి రివార్డుగా $50 మిలియన్లు ప్రకటించింది. మదురో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, క్రిమినల్ ముఠాలతో సంబంధాలను కలిగి ఉన్నాడని అమెరికా ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలను మదురో ఖండించారు. ఇదే సమయంలో కొలంబియాతో కూడా అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రంప్ ఇటీవల కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను “మాదకద్రవ్య నాయకుడు” “చెడ్డ వ్యక్తి” గా అభివర్ణించారు. దీనికి బొగోటా (కొలంబియా రాజధాని) నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలు అన్నింటి మధ్య అమెరికా సైన్యం కరేబియన్‌కు తన సైన్యాన్ని పంపించింది. ఈ క్రమంలో యూఎస్ వెనిజులాపై దాడి చేస్తుందా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
READ ALSO: Rain in Hyderabad: హైదరాబాదీలు జాగ్రత్త.. పలు చోట్ల వర్షం.. జలమయమైన రహదార్లు..!
STATEMENT:
In support of the President’s directive to dismantle Transnational Criminal Organizations (TCOs) and counter narco-terrorism in defense of the Homeland, the Secretary of War has directed the Gerald R. Ford Carrier Strike Group and embarked carrier air wing to the U.S.…
— Sean Parnell (@SeanParnellASW) October 24, 2025