Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Us Kc135 Stratotanker Missing Qatar Iran Operations Emergency 7700 Alert

US: ఖతార్‌లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!

Published Date :May 5, 2026 , 7:00 pm
By Suresh Maddala
  • ఖతార్‌లో అమెరికా సైనిక విమానం అదృశ్యం
  • అమెరికా సైనిక కార్యకలాపాల్లో కీలక ఆయుధం
  • మిస్సింగ్‌పై ఇంకా అధికారికంగా స్పందించని అమెరికా
US: ఖతార్‌లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమాసియాలో అగ్ర రాజ్యం అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ సమీపంలో KC-135 స్ట్రాటోట్యాంకర్ అనే అతిపెద్ద విమానం మిస్సింగ్ అయింది. ఈ విమానం అమెరికా సైనిక కార్యకలాపాల్లో ఒక కీలకమైన ఆయుధం. ముఖ్యంగా ఫైటర్ జెట్‌లు, బాంబర్లు, ఇతర విమానాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి గగనతలంలోనే ఇంధనం నింపడానికి ఉపయోగిస్తుంటారు. అలాంటి శక్తివంతమైన విమానం మిస్సింగ్ అయింది.

ఈ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ ధఫ్రా వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది. ఇరాన్ సమీప ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహించిన తర్వాత ఖతార్ వైపు మళ్లింది. కొద్దిసేపటికే విమానం ల్యాండింగ్ కోసం కిందికి దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వృత్తాకారంలో కదులుతున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా సూచించింది. అనంతరం 7700 ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కోడ్‌ పంపించింది. ఈ కోడ్ విమానంలో అత్యవసర పరిస్థితిని సూచిస్తోంది. అనంతరం విమానంతో సంబంధాలు తెగిపోయాయి. అయితే విమానం ప్రమాదానికి గురైందా? లేదంటే ఎక్కడైనా ల్యాండింగ్ అయిందా? అన్నది క్లారిటీ రాలేదు. లేదంటే శత్రు చర్య ఏదైనా జరిగిందా? అన్నది ఇంకా నిర్ధారణకు రాలేదు.

Also Read

  • UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
  • Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
  • Hyderabad Honeytrap: తల్లి సహకారంతోనే కొడుకుల 'రొమాంటిక్' ట్రాప్.. రంగంలోకి సీపీ సజ్జనార్
  • White House: లాక్‌డౌన్‌లో వైట్ హౌస్.. అమెరికా అధ్యక్షుడి నివాసం వద్ద గన్ ఫైర్.. రంగంలోకి సీక్రెట్ సర్వీస్!

ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. విమానం కొంతసేపు గాల్లో చుట్టూ తిరిగిన తర్వాత దిగేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా రాడార్ నుంచి మాయమైంది. ఈ ఘటనకు కారణం సాంకేతిక లోపమా? లేక శత్రు దాడా? అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. అమెరికా నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ KC-135 స్ట్రాటోట్యాంకర్ విమానం అమెరికా సైన్యంలో అత్యంత కీలక ఆస్తిగా భావించబడుతుంది. ఇది ప్రధానంగా యుద్ధవిమానాలు, బాంబర్లకు గాల్లోనే ఇంధనం నింపే ‘ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్’గా పనిచేస్తుంది. అలాగే నౌకాదళం, మెరైన్ కార్ప్స్, మిత్ర దేశాలకు కూడా మద్దతు అందిస్తుంది. అవసరమైతే సిబ్బంది రవాణా, వైద్య సహాయం (ఎయిర్ అంబులెన్స్) కోసం కూడా ఉపయోగిస్తారు.

గతంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఈ ఏడాది మార్చిలో పశ్చిమ ఇరాక్‌లో జరిగిన దాడిలో ఇదే తరహా విమానం కూలిపోయినట్లు సమాచారం. ఆ దాడికి బాధ్యతను ఇస్లామిక్ రెసిస్టెన్స్ స్వీకరించింది. ప్రస్తుతం అదృశ్యమైన ఈ విమానం స్థితిగతులపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన నెలకొంది. ఇది ప్రమాదమా? లేక దాడా? అన్నది తెలియాల్సి ఉంది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

US Military Fuel Tanker Vanishes Over Qatar After Declaring Emergency

A US Air Force Boeing KC-135 Stratotanker issued a 7700 distress signal while flying over the Persian Gulf near Iran, indicating an in-flight emergency. pic.twitter.com/5iXEV9PP3M

— Tasnim News Agency (@Tasnimnews_EN) May 5, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 7700 emergency code
  • aerial refueling tanker
  • Iran region tension
  • KC-135 Stratotanker
  • Middle East crisis

తాజావార్తలు

  • Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..

  • AirAsia Recruitment : విమానయాన రంగంలో కొత్త శకం.. చెన్నైస్ అమృతలో ఎయిర్‌ఏషియా భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్.!

  • US: ఖతార్‌లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • Be Alert : ఫ్రీగా సినిమా చూద్దామని కక్కుర్తిపడి ₹1,75,000 కోల్పోయిన వ్యక్తి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions