Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు ఇది నిజంగా తీపి కబురు. జట్టులో అత్యంత కీలకమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగిన నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి జట్టులోకి వచ్చేస్తున్నారు. దీంతో SRH మిడిల్ ఆర్డర్‌కు కొండంత బలం చేకూరనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో యంగ్ సెన్సేషన్ నితీశ్ కుమార్ రెడ్డి పాత్ర అత్యంత కీలకంగా మారింది. కేవలం హిట్టర్‌గానే కాకుండా, ఇన్నింగ్స్‌ను నిర్మించగల సత్తా ఉన్న ఆటగాడిగా అతను తనను తాను నిరూపించుకున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా నితీశ్ ప్రదర్శించిన నిలకడ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు ఒత్తిడిని తట్టుకుంటూ మిడిల్ ఆర్డర్లో ఇన్నింగ్స్‌ను నిలబెట్టడం, అవసరమైనప్పుడు భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో అతను కీ ప్లేయర్‌గా మారాడు. అందుకే నితీశ్ జట్టులో ఉండటం అదనపు బలం మాత్రమే కాదు, అది SRH బ్యాటింగ్ లైనప్‌కు ఒక భరోసా.
హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ అప్డేట్..
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన కీలక మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి అనారోగ్యం కారణంగా దూరమవ్వడం జట్టుపై ప్రభావం చూపింది. ఆ మ్యాచ్‌లో SRH ఓటమి పాలవడంతో, అతని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే, పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ సానుకూల ప్రకటన చేశారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
“ఈరోజు ఉదయం నేను నితీశ్‌తో వ్యక్తిగతంగా మాట్లాడాను. అతని ఆరోగ్యం ఇప్పుడు చాలా వరకు మెరుగైంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం. అతను జట్టులో తిరిగి చేరడం మాకు ఎంతో ముఖ్యం,” అని వెటోరీ పేర్కొన్నారు.
నితీశ్ రాకతో పెరగనున్న బలం..
నితీశ్ కుమార్ రెడ్డి రాకతో SRH ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడకుండా చూస్తూనే, రన్ రేట్ తగ్గకుండా ఆడటంలో నితీశ్ దిట్ట. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా, బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీస్తూ వెటోరీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్ వంటి జట్లతో ఆడేటప్పుడు మిడిల్ ఆర్డర్లో నిలకడగా ఆడే ఆటగాడు అవసరం. నితీశ్ ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చగలడు.
KKR చేతిలో ఓటమి తర్వాత సన్‌రైజర్స్ మళ్లీ విజయాల బాట పట్టాలంటే ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యం. నితీశ్ కుమార్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం, అతను పంజాబ్‌తో మ్యాచ్‌కు సిద్ధమవ్వడం SRH శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతోంది. రేపటి మ్యాచ్‌లో నితీశ్ తన మార్క్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!