Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hantavirus Alert: ఇప్పటికే ఎన్నో రకాల వైరస్‌లు అతలాకుతలం చేశాయి.. కరోనా.. ఆ తర్వాత అందులో వచ్చిన వేరియంట్ల భయం పూర్తిగా మర్చిపోక ముందే.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి వైరస్ భయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఒక క్రూయిజ్ షిప్‌లో ముగ్గురు మరణించిన ఘటనతో హంటా వైరస్ పై ఆందోళనలు పెరిగాయి. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ సాధారణ ఫ్లూ లాంటి లక్షణాలతో ప్రారంభమైనప్పటికీ, తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం సాధారణ ప్రజలకు ప్రమాదం తక్కువగానే ఉందని World Health Organization (WHO) స్పష్టం చేసింది.
హంటా వైరస్ ఎలా వస్తుంది..?
హంటా వైరస్ ప్రధానంగా ఎలుకలు, వాటి మూత్రం, మలం లేదా లాలాజలం ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. గాలిలో తేలియాడే సూక్ష్మ కణాల ద్వారా కూడా ఇది శరీరంలోకి ప్రవేశించగలదు. అడవులు, పాత భవనాలు, పొలాల్లో పని చేసే వారికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
హంటా వైరస్ లక్షణాలు..?
ఈ వైరస్ లక్షణాలు మొదట్లో సాధారణ ఫ్లూ మాదిరిగానే కనిపిస్తాయి. జ్వరం, శరీర నొప్పులు, తలనొప్పి, వికారం, తేలికపాటి దగ్గు వంటి సమస్యలు ప్రారంభ లక్షణాలు. కానీ తీవ్రస్థాయికి చేరితే ఇది ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై ప్రభావం చూపి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అయితే, సాధారణ ఫ్లూతో పోలిస్తే హంటా వైరస్ చాలా ప్రమాదకరం. కొన్ని ప్రాంతాల్లో మరణాల రేటు 14 శాతం వరకు ఉండగా, అమెరికా ఖండంలో ఇది 40 శాతం వరకు నమోదవుతోంది. ఫ్లూ వల్ల అరుదుగా మరణాలు సంభవిస్తాయి, కానీ హంటావైరస్ తీవ్రమైన అవయవ నష్టాన్ని కలిగిస్తుంది.
వేల సంఖ్యలో కేసులు..!
ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చైనా, రష్యా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రతి ఏడాది వేల సంఖ్యలో కేసులు కనిపిస్తున్నాయి. అమెరికా, ఫిన్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సాధారణంగా వ్యాపించదు. అయితే ఆండెస్ వైరస్ అనే ఒక ప్రత్యేక రకం మాత్రం సన్నిహిత సంబంధం ద్వారా వ్యాపించే అవకాశం ఉంది. ఇటీవల క్రూయిజ్ షిప్‌లో జరిగిన ఘటనలో ఈ వైరస్ ఎలా వ్యాపించిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
చికిత్స ఏమైనా ఉందా?
హంటా వైరస్‌కు ప్రత్యేకమైన చికిత్స లేదు. వైద్యులు లక్షణాల ఆధారంగా చికిత్స అందిస్తారు. తీవ్రమైన కేసుల్లో ఐసీయూలో ఆక్సిజన్, ఇతర సహాయక చికిత్సలు అందిస్తారు. త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఈ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే ముందస్తు జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఎలుకలు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండటం, ఇళ్లను శుభ్రంగా ఉంచడం, ఎలుకల మలమూత్రాలతో సంబంధం ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసేటప్పుడు మాస్క్, గ్లౌజులు ఉపయోగించడం అవసరం. మూసి ఉన్న ప్రదేశాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వేరు చేయడం కూడా ముఖ్యమే. మొత్తానికి, హంటా వైరస్ సాధారణ ఫ్లూ లాగా కనిపించినప్పటికీ, అది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పెద్దగా భయపడాల్సిన అవసరం లేకపోయినా, అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత.
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?