US-Iran Peace Agreement: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ ‘15 కీలక షరుతులు’ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Peace Agreement: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాల అధ్యక్షులు చారిత్రాత్మక మైత్రి ఒప్పందం (MoU)పై అధికారికంగా సంతకాలు చేశారు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న శత్రుత్వానికి బ్రేక్ వేస్తూ జరిగిన ఈ ఒప్పందం అంతర్జాతీయ దౌత్య రంగంలో ఒక ముందడుగుగా నిలిచింది. ఫ్రాన్స్‌లోని వర్సాలీస్ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేయగా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ కూడా దీనిని ఆమోదించారు. దీనికంటే ముందే ఆదివారం నాడే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్, ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ గాలిబాఫ్‌లు ఎలక్ట్రానిక్ పద్ధతిలో సంతకాలు పూర్తి చేశారు. ప్రపంచ శాంతికి, ముఖ్యంగా పశ్చిమాసియాలో స్థిరత్వానికి దారితీసే ఈ అమెరికా-ఇరాన్ ఒప్పందంలోని 15 ముఖ్యమైన నిబంధనల (షరతులు) గురించి తెలుసుకుందాం..
1. తక్షణ సైనిక చర్యల నిలిపివేత: ఈ ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే అమెరికా, ఇరాన్ దేశాలు అన్ని రంగాలలో తమ సైనిక చర్యలను తక్షణమే, శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తాయి. పరస్పరం ఎలాంటి యుద్ధాలు లేదా సైనిక విన్యాసాలు చేపట్టకూడదని, అలాగే లెబనాన్ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
2. సార్వభౌమాధికారానికి గౌరవం: ఇరు దేశాలు ఒకదానికొకటి సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించుకోవాలి. అలాగే పరస్పర అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు.
3. తుది ఒప్పందానికి గడువు: రెండు దేశాలు రాబోయే 60 రోజుల్లోగా చర్చల ద్వారా తుది ఒప్పందాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాయి. ఒకవేళ ఇరుపక్షాలు అంగీకరిస్తే ఈ గడువును మరికొంత కాలం పొడిగించవచ్చు.
4. నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేత: ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన వెంటనే ఇరాన్‌పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని, ఇతర అడ్డంకులను అమెరికా తొలగించడం ప్రారంభిస్తుంది. 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తిగా ముగుస్తుంది. ఈ సమయంలోగా ఇరాన్ తన నౌకల రాకపోకలను యుద్ధానికి ముందున్న సాధారణ స్థాయికి తీసుకువస్తుంది.
5. సైనిక ఉపసంహరణ: తుది ఒప్పందం కుదిరిన 30 రోజుల్లోగా ఇరాన్‌కు సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రాంతాల నుంచి అమెరికా తన సైనిక బలగాలను, ఉనికిని పూర్తిగా ఉపసంహరించుకుంటుంది.
6. సురక్షిత సముద్ర రవాణా: ఒప్పందం కుదిరిన తర్వాత పర్షియన్ గల్ఫ్ నుంచి ఓమన్ సముద్రం వరకు, అలాగే తిరిగి వచ్చే వాణిజ్య నౌకల కోసం ఇరాన్ 60 రోజుల పాటు ఉచిత, సురక్షిత మార్గాన్ని కల్పిస్తుంది. హోర్ముజ్ జలసంధిలో నిరంతరాయ నౌకాయాన సేవలను క్రమబద్ధీకరించడానికి ఇరాన్ ఓమన్‌తో చర్చిస్తుంది.
7. రూ. 300 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం: ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం అమెరికా తన ప్రాంతీయ మిత్రదేశాలతో కలిసి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందిస్తుంది. దీని కోసం అమెరికా కనీసం 300 బిలియన్ డాలర్ల నిధులను నిర్ధారిస్తుంది. 60 రోజుల్లోగా దీనిని అమలు చేసే విధానాన్ని ఖరారు చేస్తారు.
8. ఆంక్షల పూర్తిగా రద్దు: ఇరాన్‌పై విధించిన అన్ని రకాల ఆంక్షలను తొలగించడానికి అమెరికా అంగీకరించింది. ఇందులో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తీర్మానాలు, ఐఏఈఏ (IAEA) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలు, అమెరికా విధించిన ఏకపక్ష ప్రాథమిక, ద్వితీయ (Secondary) ఆంక్షలన్నీ ఉన్నాయి.
9. ఆంక్షల తొలగింపుపై తక్షణ చర్చలు: ఆంక్షల రద్దు అనేది అత్యంత కీలకమైన అంశం కాబట్టి, ఈ విషయంలో పరస్పర అంగీకారానికి రావడానికి ఇరు దేశాలు తక్షణమే చర్చలు ప్రారంభించి గంభీరమైన ప్రయత్నాలు చేస్తాయి.
10. అణ్వాయుధాల తయారీకి స్వస్తి: తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ వద్ద ప్రస్తుతం ఉన్న సంవర్ధిత అణు నిల్వల భవిష్యత్తు నిర్వహణ, వాటి పారదోలడం (Disposal) వంటి విషయాలను పరస్పర అంగీకారంతో కూడిన ఒక ప్రత్యేక వ్యవస్థ ద్వారా పరిష్కరిస్తారు.
11. యురేనియం సంవర్ధనంపై చర్చలు: యురేనియం సంవర్ధనం, ఇరాన్ యొక్క శాంతియుత అణు అవసరాలకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చలు జరుపుతాయి. తుది ఒప్పందంలో అంగీకరించే ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా ఈ చర్చలు సాగుతాయి.
12. యథాతథ స్థితి (Status Quo) నిర్వహణ: తుది ఒప్పందం కుదిరే వరకు ఇరు దేశాలు ప్రస్తుతమున్న యథాతథ స్థితిని కొనసాగిస్తాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ప్రస్తుత స్థాయిలోనే ఉంచుతుంది. అమెరికా ఎలాంటి కొత్త ఆంక్షలు విధించదు. ఈ ప్రాంతంలో అదనపు సైనిక బలగాలను మోహరించదు.
13. చమురు ఎగుమతులకు మినహాయింపులు: ఈ ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే, ఆంక్షలు పూర్తిగా తొలగించబడే వరకు ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులకు అవసరమైన ఆర్థిక అనుమతులను (Waivers) అమెరికా ఆర్థిక శాఖ మంజూరు చేస్తుంది. వీటికి సంబంధించిన బ్యాంకింగ్ లావాదేవీలు, ఇన్సూరెన్స్, రవాణా సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
14. ఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల: ఒప్పందం అమలులోకి రాగానే విదేశాలలో నిలిచిపోయిన (Freeze చేసిన) ఇరాన్ ఆస్తులను పూర్తిగా విడుదల చేస్తారు. ఈ నిధులను తిరిగి అప్పగించే ప్రక్రియపై ఇరు దేశాలు చర్చల ద్వారా ఉమ్మడి నిర్ణయం తీసుకుంటాయి.
15. పర్యవేక్షణ: ఈ మైత్రి ఒప్పందం విజయవంతంగా అమలు కావడానికి, భవిష్యత్తులో తుది ఒప్పందాన్ని ఇరు దేశాలు సరిగ్గా పాటిస్తున్నాయో లేదో పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. చివరగా ఈ తుది ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఆమోదం లభిస్తుంది.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!