NTV Telugu Site icon

USA: చైనా, కెనడా, మెక్సికోలతో భారత్‌ను పోల్చము: అమెరికా

Modi Trump

Modi Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్‌ 2 నుంచి పరస్పర సుంకాలను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా, కెనడా, మెక్సికోలతో భారత్‌ ను పోల్చమని యూఎస్‌ తెలిపింది. భారత్‌- అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూఎస్‌కు చెందిన వాణిజ్య శాఖ అధికారులు, ఢిల్లీలోని అధికారులతో చర్చల సమయంలో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

READ MORE: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి తిరుగుబాటు? స్పందించిన తాత్కాలిక ప్రభుత్వం

ఇదిలా ఉండగా.. భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే సుంకాలు తగ్గించాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు సూచిస్తున్నారు. లేకపోతే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు తప్పవని తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులు తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 55 శాతం ఉన్న సుంకాలను 30 శాతానికి తగ్గించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ సుంకాల తగ్గింపు ఏకంగా 23 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఈ నిర్ణయం ఇంకా పరిశీలన దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

READ MORE: South Korea: కార్చిచ్చు విధ్వంసం.. 24కు చేరిన మృతుల సంఖ్య..