ఎయిడ్స్ కి కారణమయ్యే HIV వైరస్ ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సవాళ్లలో ఒకటి . అయితే, కొత్త HIV ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి, HIV ఉన్న ప్రతి ఒక్కరికీ చికిత్స అందుబాటులో ఉండేలా చేసేందుకు వరల్డ్ వైడ్ గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. HIV చికిత్సలో దశాబ్దాల పురోగతి ఉన్నప్పటికీ, ప్రతి సంవత్సరం పది లక్షల మందికి పైగా కొత్తగా వ్యాధి బారిన పడుతున్నారు. సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లెనాకాపావిర్ అనే దీర్ఘకాలం పనిచేసే ఔషధాన్ని ఆమోదించింది. ఇది సంవత్సరానికి కేవలం రెండు ఇంజెక్షన్లతో HIV నుంచి దాదాపు పూర్తి రక్షణను అందిస్తుందని తెలిపింది. HIV నివారణ ప్రయత్నాలలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొంటూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) FDA నిర్ణయాన్ని స్వాగతించింది.
Also Read:OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. సిరీస్ లు ఇవే
ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ (PrEP) అని పిలువబడే HIV నివారణ మందులు దశాబ్ద కాలంగా ఉన్నప్పటికీ, రోజువారీ మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దినచర్యను చాలా మంది స్థిరంగా పాటించడం కష్టం. “దశాబ్దాలుగా HIV పై జరుగుతున్న పోరాటంలో ఇది ఒక చారిత్రాత్మక రోజు. యెజ్టుగో మన కాలంలోని అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ పురోగతులలో ఒకటి. HIV మహమ్మారిని అంతం చేయడంలో సహాయపడతుందని” గిలియడ్ సైన్సెస్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేనియల్ ఓ’డే అన్నారు . “ఇది సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే ఇవ్వాల్సిన ఔషధం, క్లినికల్ అధ్యయనాలలో అద్భుతమైన ఫలితాలను చూపించిందని తెలిపారు.
Also Read:Suicide : పెళ్లయిన మూడున్నర నెలలకే వేధింపులు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
లెనాకాపావిర్, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారిలో HIV సంక్రమణ ప్రమాదాన్ని 99.9 శాతానికి పైగా తగ్గిస్తుందని తేలింది. ఇది క్రియాత్మకంగా శక్తివంతమైన వ్యాక్సిన్‌కు సమానంగా ఉంటుంది. ఆ కంపెనీ రెండు పెద్ద క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. మొదటిది, సబ్-సహారా ఆఫ్రికాలో 2,000 కంటే ఎక్కువ మంది మహిళలతో నిర్వహించింది. దీని ఫలితంగా ఇన్ఫెక్షన్లు 100 శాతం తగ్గాయి. రెండవ ట్రయల్స్ లో 2,000 మందికి పైగా పురుషులు, లింగ-వైవిధ్య వ్యక్తులు పాల్గొన్నప్పుడు, కేవలం రెండు ఇన్ఫెక్షన్లు మాత్రమే నమోదయ్యాయి – 99.9 శాతం నివారణ రేటు నమోదయ్యింది.
Also Read:Axiom-4: ఆక్సియం -4 మిషన్ ప్రయోగాన్ని మళ్ళీ వాయిదా వేసిన నాసా..
గిలియడ్ యెజ్టుగో ధరను వెల్లడించనప్పటికీ, విశ్లేషకులు US ప్రయోగ ఖర్చు సంవత్సరానికి $25,000 కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. హెచ్ఐవి మహమ్మారిని అంతం చేయడానికి గిలియడ్ ధరను భారీగా తగ్గించాలని కోరుతున్నారు. అధిక ఆదాయ దేశాలు కూడా సంవత్సరానికి US $20,000 కంటే ఎక్కువ ధరలకు లెనాకాపావిర్‌ను విస్తృతంగా ఉపయోగించుకోలేవు అని రసాయన శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆండ్రూ హిల్ అన్నారు. “మహమ్మారిని అంతం చేసే సామర్థ్యం ఉన్న ఔషధానికి వెయ్యి రెట్లు ఎక్కువ వసూలు చేయడం సరికాదని” ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్ విన్నీ బ్యానిమా అన్నారు. “ఇంత ఖరీదైన మందులతో మనం ఎయిడ్స్‌ను అంతం చేయలేము.” అని తెలిపారు.