US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
- అమెరికా, చైనాల మధ్య ముదిరిన చిప్ వార్..
- 5 దేశాలకు అధునాతన చిప్‌ల ఎగుమతిపై US ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-China Chip War: అమెరికా, చైనాల మధ్య చిప్ వార్ మొదలైంది. ఇటీవల ఎన్విడియా కంపెనీకి చెందిన ఏఐ చిప్స్ అక్రమ మార్గాల ద్వారా చైనాకు ఎగుమతి అయ్యాయనే వార్తలు వచ్చాయి . ఈ నేపథ్యంలో చైనా కంపెనీలు విదేశీ డేటా సెంటర్ల ద్వారా అమెరికా అధునాతన ఏఐ చిప్‌లను పొందకుండా అడ్డుకునేందుకు అమెరికా కొత్త ఆంక్షల్ని విధించింది. ఇందులో భాగంగా మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, సింగపూర్, బ్రెజిల్ దేశాలకు పంపించే ఏఐ చిప్‌లపై ఎగుమతి లైసెన్సింగ్ నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది.
అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఎన్విడియాపై దర్యాప్తు జరుపుతుందనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఇప్పటికే నియంత్రణపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఎన్విడియాపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ వార్తల నేపథ్యంలో నవంబర్ 20న ఎన్విడియా షేర్లు 11.5 శాతం పడిపోయాయి. తాజా ఆంక్షల తర్వాత ఆగ్నేయాసియాలో ఏఐ మౌలిక సదుపాయాల పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇదే సమయంలో సెమికండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు వేగం కావచ్చని నవంబర్ 19న జెఫరీస్ విడుదల చేసిన ‘గ్రీడ్ అండ్ ఫియర్’ నివేదిక వెల్లడించింది.
Also Read
- US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చైనా మద్దతు..
- Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
- Rohingya Genocide: రోహింగ్యాలను కావాలనే చంపారు..తేల్చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం!
- New York Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉద్యోగం సాధించిన వారానికే మృత్యుఒడికి..
చైనా కంపెనీలకు విదేశీ డేటా సెంటర్ల ద్వారా చిప్ యాక్సెస్..
అమెరికా ఇప్పటికే చైనా కంపెనీలకు అధునాతన ఏఐ చిప్‌లను నేరుగా కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించింది. అయితే, విదేశీ డేటా సెంటర్లు, క్లౌడ్ సర్వీస్ ద్వారా చైనా సంస్థలు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పొందుతున్నాయనే ఆందోళన ఉంది. 2024లో నిషేధం అమలైనప్పటి నుంచి సుమారు 2,40,000 ఎన్విడియా చిప్‌లు చైనాకు అక్రమ రవాణా జరిగి ఉండొచ్చని జెఫరీస్ అంచనా వేసింది. సింగపూర్‌కు చెందిన మెగా స్పీడ్ సంస్థ, అలీబాబా సహా ఇతర చైనా కస్టమర్లకు సుమారు 86,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను (GPUలు) లీజుకు ఇస్తోందని ఈ నివేదిక ప్రస్తావించింది.
సొంత సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించుకుంటున్న చైనా..
అమెరికా టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చైనా తన దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. చిప్ డిజైన్, తయారీ, పరికరాలు, ముడి పదార్థాల రంగాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటోంది.
తాజావార్తలు
-
US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
-
HSRP Number Plate : తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్..
-
US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చైనా మద్దతు..
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!