YCP Protest: ఉరవకొండలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోమవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు, భూ దందాలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ కూడా నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. మరోవైపు విడపనకల్లు మండలం జనార్దనపల్లిలో పాండురంగస్వామి ఆలయ భూమిని కొందరు వైసీపీ నేతలు ఆక్రమించారని ఆరోపిస్తూ ఆలయ పరిరక్షణ సమితి ఆందోళనకు సిద్ధం కాగా.. ఆ కార్యక్రమానికి బీజేపీ మద్దతు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడు వర్గాల నుంచి ధర్నాలకు అనుమతి కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. అయితే గుంతకల్లు పోలీసు సబ్‌డివిజన్ పరిధిలో ప్రస్తుతం సెక్షన్-30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని సీఐ మహానంది వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. భూ ఆక్రమణలకు సంబంధించిన అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని, అలాగే సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (పీ్జీఆర్ఎస్) కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కారణాల వల్ల ధర్నాలకు అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు.
Also Read
- Aaqib Nabi: బుమ్రా ఔట్.. టీమిండియాలోకి కొత్త పేసర్ 'ఆకిబ్ నబీ' ఎంట్రీ..!
- Ujjaini Mahankali Rangam: 'ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పరిణామాలు తప్పవు'.. రంగం కార్యక్రమంలో ఆసక్తికర భవిష్యవాణి..!
- Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ కేసులో మరో ట్విస్ట్.. ప్రేమలేఖలు, ల్యాప్‌టాప్ స్వాధీనం..!
- Women's Asia Cup 2026కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మందాన..!
అయితే పోలీసుల నిర్ణయంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలిరావాలని పిలుపునిస్తూ ఆయన చేసిన వీడియోను వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ధర్నాలోపాల్గొనేందుకు వెళ్తున్న విశ్వేశ్వర రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా వాహనంలో ఎక్కించారు. దాంతో వైసీపీ శ్రేణులు, పోలిసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ధర్నాకు హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
YCP Protest: ఉరవకొండలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ!
-
Solar Eclipse: అజ్ఞానం రాసిన కథను.. విజ్ఞానం తిరగరాసింది.. సూర్యగ్రహణం వెనుక దాగిన నిజం!
-
Vismaya Mohanlal: ప్రణవ్‌తో హిమాలయాల్లో దారి తప్పిన విస్మయ.. 7 గంటల ట్రెక్, ఓ కుక్కపిల్ల.. ఇదొక మరపురాని కథ!
-
Tamil Nadu Farmers Protest: కావేరీ నీటి కోసం.. నదీ తీరంలో ఇసుకలో కూరుకుపోయి రైతుల వినూత్న నిరసన
-
Aaqib Nabi: బుమ్రా ఔట్.. టీమిండియాలోకి కొత్త పేసర్ ‘ఆకిబ్ నబీ’ ఎంట్రీ..!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!