యూపీ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో యూపీఎస్సీకి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి తన ప్రైవేట్ పార్ట్‌ను తానే కోసుకున్నాడు. గదిలో నొప్పితో విలపించడంతో గమనించిన చుట్టుపక్కల వ్యక్తులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు ఇలా చేయడానికి గల కారణాన్ని తెలుసుకుని అందరూ కంగుతిన్నారు. నిజానికి.. ఆ యువకుడు తన లింగాన్ని మార్చుకోవాలనుకున్నాడు. దీని కోసం ముందుగా తనకు తాను అనస్థీషియా ఇంజెక్ట్ చేసుకున్నాడు. అనంతరం సర్జికల్ బ్లేడుతో తన ప్రైవేట్ భాగాన్ని కత్తిరించుకున్నాడు. గదిలో నొప్పితో బాధపడుతున్న యువకుడిని ఇంటి యజమాని, తదితరులు గమనించి సమీపంలోని బెయిలీ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు పెద్దసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని సర్జికల్ వార్డులో యువకుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ యువకుడి వయస్సు 22-23 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు.
యువకుడి కథ..
అతడిది అమేథి జిల్లా నివాసి. అతని తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. నెమ్మదిగా అమ్మాయిల లక్షణాలు రావడం ప్రారంభించాయి. తాను అబ్బాయిని కాదని, అమ్మాయిని అని ఆ విద్యార్థి అంటున్నాడు. తను ఏకైక కుమారుడు కావడంతో అతను తన కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పలేక పోయాడు. కొన్ని రోజులు తన అత్త ఇంట్లో ఉన్నాడు. అనంతరం చదువు నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌కు వచ్చాడు. ప్రస్తుతం నగరంలో అద్దె గదిలో ఉంటూ UPSC పరీక్షకు సిద్ధమవుతున్నాడు.
READ MORE: Marriage Fraud: మరీ ఇంత దురదృష్టం ఏంటి భయ్యా.. నిజంగా పాపం సర్!
క్రమంగా తాను అమ్మాయిలా మారాలని భావించాడు. యూట్యూబ్‌లో సమాచారం కోసం వెతికేవాడు. కాట్రాలోని నకిలీ వైద్యుడు జెనిత్ను సంప్రదించాడు. అతని సలహా మేరకు.. ఒక మెడికల్ స్టోర్ నుంచి అనస్థీషియా ఇంజెక్షన్, సర్జికల్ బ్లేడ్‌ను కొనుగోలు చేశాడు. రూంలో ఒంటరిగా ఉన్న అతడు.. తనకు తానుగా అనస్థీషియా ఇంజెక్ట్ చేసుకున్నాడు.చేతులతో తన ప్రైవేట్ భాగాన్ని కట్ చేసుకున్నాడు. అనస్థీషియా ఇంజెక్షన్ ప్రభావం ఉన్నంత వరకు.. ఏం అనిపించలేదు. కానీ దాని ప్రభావం తగ్గగానే.. నొప్పి తట్టుకోలేకపోయాడు. సిగ్గుతో ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఆ యువకుడు గదిలో దాదాపు గంటసేపు నొప్పితో మెలికలు తిరుగుతూనే ఉన్నాడు.
READ MORE: Rashmika : విజయ్ తో ఎంగేజ్ మెంట్.. తానే అందరికీ చెప్తానన్న రష్మిక..
నొప్పి నివారణ మందులు తీసుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. మరోవైపు, నేలపై రక్తం ప్రవహిస్తోంది. నొప్పి తాళలేక గట్టి గట్టిగా అరవడంతో ఆ ఇంటి యజమాని, పలువురు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం, స్పెషలిస్ట్ వైద్యుల బృందం చికిత్స ప్రారంభించింది. తన గొంతు అమ్మాయి గొంతు లాగే మారిందని.. నడక శైలి, అమ్మాయిలాగే మారిందని చెబుతున్నాడు. తనను అమ్మాయిలాగా మార్చాలని ప్రాథేయపడుతున్నాడు. మరోవైపు, కొడుకు పరిస్థితి చూసి తల్లికి కన్నీళ్లు ఆగడం లేదు. తన కుమారుడిని చూస్తానని.. చేతులు జోడించి ప్రాథేయపడాటాన్ని చూసి అందరి కళ్లు చెమ్మగిల్లాయి. ఈ అంశంపై వైద్యుడు వివరణ ఇచ్చారు. ఆ విద్యార్థి జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ లేదా జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్నాడని అన్నారు. సకాలంలో ఆసుపత్రికి చేరుకోకపోతే ప్రాణాలు కోల్పోయేవాడని తెలిపారు. విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చి అతని అభిప్రాయం కూడా తీసుకుంటామని.. అనంతరం ఏం చేయాలో నిర్ణయిస్తామని వెల్లడించారు.