యూపీ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో యూపీఎస్సీకి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి తన ప్రైవేట్ పార్ట్‌ను తానే కోసుకున్నాడు. గదిలో నొప్పితో విలపించడంతో గమనించిన చుట్టుపక్కల వ్యక్తులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు ఇలా చేయడానికి గల కారణాన్ని తెలుసుకుని అందరూ కంగుతిన్నారు. నిజానికి.. ఆ యువకుడు తన లింగాన్ని మార్చుకోవాలనుకున్నాడు. దీని కోసం ముందుగా తనకు తాను అనస్థీషియా ఇంజెక్ట్ చేసుకున్నాడు.