NTV Telugu Site icon

Parliament: జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి ఉన్న సంబంధంపై పార్లమెంటులో రచ్చ..

Parliament

Parliament

ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ (ఎఫ్‌డిఎల్-ఎపి)తో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ తన ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్టు ద్వారా పంచుకుంది . “కశ్మీర్‌ స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న ఆలోచనకు ఈ ఫౌండేషన్‌ మద్దతు తెలిపింది. భారత అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేయడానికి విదేశీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ” అని పేర్కొంది.

READ MORE: Illegal Sand Mining: రాజమండ్రిలో అక్రమ ఇసుక తవ్వకాలు.. 18 పడవలు సీజ్

సోనియాగాంధీపై వచ్చిన ఈ ఆరోపణలపై సోమవారం పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. బీజేపీ ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ కాంగ్రెస్ ఎంపీలు సభలో రచ్చ సృష్టించడం ప్రారంభించారు. దీంతో లోక్‌సభ వాయిదా పడాల్సి వచ్చింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ ఓం బిర్లా తన స్థానానికి చేరుకోగానే.. విపక్ష సభ్యులు తమ సీట్ల నుంచి లేచి సమస్యలను లేవనెత్తడం ప్రారంభించారు. అవి స్పష్టంగా వినిపించలేదు. స్పీకర్ స్పందిస్తూ.. ప్రశ్నోత్తరాల సమయంలో ఎలాంటి అంశం ప్రస్తావనకు రాలేదన్నారు.

READ MORE: CM Revanth Reddy: దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

ప్రశ్నోత్తరాల సమయం అత్యంత కీలకమని స్పీకర్ అన్నారు. “సభా కార్యక్రమాలు సమంజసంగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు. మీరు మాత్రం సభలో గోల చేస్తున్నారు. మీ దృష్టిలో సభ నడవ కూడదని ఉంది.” అని పేర్కొన్నారు. దీనిపై విపక్ష సభ్యులు ఏదో మాట్లాడటం ప్రారంభించారు. ఆ తర్వాత స్పీకర్ బిర్లా వెంటనే సభా కార్యక్రమాలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.