CM Revanth Reddy: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోనియాగాంధీ 78వ జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ సభ తరఫున, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రంతో, ఇక్కడ ప్రజలతో సోనియాగాంధీది విడదీయలేని అనుబంధం అన్నారు. 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, మన దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అన్నారు. సోనియా గాంధీకి మరొక్కసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Read also: BRS Leaders Arrested: అసెంబ్లీ గేట్టు వద్ద టీషర్ట్ రచ్చ.. బీఆర్ఎస్ నేతలు అరెస్ట్
తెలంగాణ తల్లి విగ్రహ ప్రకటనపై సీఎం మాట్లాడుతూ.. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచి పోవాలని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ తల్లికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదని అన్నారు. అలాంటి గుర్తింపు ఇవ్వాలని అనుకున్నామని సీఎం అన్నారు. తెలంగాణ తల్లి అంటే భావన కాదు.. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాంటి తల్లి విగ్రహ ఆవిష్కరణ సచివాలయంలో జరుపుకోబోతున్నామని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు నిలువెత్తు తల్లి.. తెలంగాణ విగ్రహం అన్నారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామన్నారు. పీఠంలో నీలి రంగు, గోదావరి, కృష్ణమ్మల గుర్తులు అమర్చినట్లు తెలిపారు.
Russia: “కష్ట సమయాల్లో మా స్నేహితులను విడిచిపెట్టం”.. అమెరికా, మాకు మధ్య తేడా