UI Teaser : ఉపేంద్ర యూఐ టీజర్ అదిరిపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో మరియు దర్శకుడు ఉపేంద్ర దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని తీస్తున్న తాజా చిత్రం ‘UI’. మనోహరన్- శ్రీకాంత్ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది.,గతేడాది సెప్టెంబర్ లో ఈ మూవీ పోస్టర్ తోనే ఇంటర్నెట్ లో సెన్షేషన్ క్రియేట్ చేసిన ఉపేంద్ర తాజాగా సోమవారం (జనవరి 8) ఫస్ట్ లుక్ టీజర్ ద్వారా అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు.ఉపేంద్ర నటించి, డైరెక్ట్ చేసిన ఈ యూఐ మూవీ టీజర్ మనల్ని ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇది ఏఐ వరల్డ్ కాదు.. యూఐ వరల్డ్ అని బ్యాక్‌గ్రౌండ్ లో వినిపించే ఓ వాయిస్ తో టీజర్ మొదలవుతుంది. సుమారు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ లో తర్వాత మరో డైలాగ్ అయితే వినిపించదు. కానీ గ్రాండ్ విజువల్స్ తో అదిరిపోయింది..ఇందులోని స్పెషల్ ఎఫెక్ట్స్, స్టంట్స్ అలాగే చివర్లో ఉపేంద్ర ఎంట్రీ.. అన్నీ సరికొత్త అనుభూతిని కలిగించాయి. యూఐ మూవీ సరికొత్త కథాంశంతో ఊహలకు అందని విధంగా ఉండనున్నట్లు సమాచారం..
ఈ టీజర్ ను మేకర్స్ సోమవారం సోషల్ మీడియా ద్వారా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. “వెల్‌కమ్ టు ద వరల్డ్ ఆఫ్ యూఐ” అనే క్యాప్షన్ తో ఉపేంద్ర ఈ టీజర్ ను పోస్ట్ చేశాడు.ఈ టీజర్ ద్వారా సినిమా అసలు స్టోరీ ఏంటన్నది ఏమాత్రం రివీల్ కాలేదు. జైల్లో బంధీలైన కొన్ని వందల మంది హాహాకారాలు మరియు భిన్నమైన గెటప్‌లతో కనిపించే పాత్రలు, చివరల్లో వాళ్లను ఆదుకోవడానికి గుర్రంపై ఎంట్రీ ఇచ్చే హీరో.. ఇలా టీజర్ అంతా కూడా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది.2015లో ఉప్పి 2 మూవీ తర్వాత ఉపేంద్ర మరోసారి డైరెక్టర్ గా మారి ఈ యూఐ మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఉపేంద్ర కెరీర్లో డైరెక్టర్ గా ఇది 11వ సినిమా. సుమారు రూ.100 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సినిమా మొత్తాన్ని ఓ వర్చువల్ రియాల్టీ సెటప్ లో తీసినట్లు మేకర్స్ తెలిపారు.ఈ మూవీ కోసం ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ క్రియేషన్ టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో 90 శాతం గ్రాఫిక్స్ ఉంటాయని ఆ మధ్య ఉపేంద్ర తెలిపారు.
Also Read
- Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
- Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
తాజావార్తలు
-
Zodiac Signs : దసరా వేళ ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
-
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
-
Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
-
Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
-
Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!