Upasana Konidela : డెలివరీ తర్వాత మొదటి వీడియో షేర్ చేసిన ఉపాసన..

Ramcharan Upasana

Ramcharan Upasana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు (బాబు, పాప) జన్మించిన సంగతి తెలిసిందే. జనవరి 31న ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పంచుకున్నారు. అయితే, తాజాగా ఉపాసన తన డెలివరీకి ముందున్న టెన్షన్, పిల్లలు పుట్టిన తర్వాత నెలకొన్న సందడిని వివరిస్తూ ఒక భావోద్వేగపూరితమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read : Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’.. టీజర్ లాంచ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్!

అపోలో వైద్యులకు, అభిమానులకు ధన్యవాదాలు పేర్కొన్నా ఉపాసన.. తన పోస్ట్‌లో ఇలా ‘ఈ వీడియో చూసిన ప్రతిసారి నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. మా కుటుంబంపై ఇంత ప్రేమ చూపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అపోలో ఆసుపత్రి వైద్యుల సంరక్షణ, రామ్ చరణ్ అభిమానుల మద్దతు వెలకట్టలేనివి’ ఈ వీడియోలో డెలివరీ కోసం చేసిన ఏర్పాట్లు, ఆ సమయంలో రామ్ చరణ్ పక్కనే ఉండి ఇచ్చిన ధైర్యం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ఉపాసన ఇద్దరు బిడ్డలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే క్లీంకార అనే కుమార్తె ఉన్న రామ్ చరణ్-ఉపాసన దంపతులు, ఇప్పుడు ఒకేసారి ఇద్దరు వారసులు రావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ వీడియోలో ఆధ్యాత్మిక గురువులు.. జ్యోతిష్యులు కూడా కనిపించడం విశేషం.