మహిళల ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ లో చివరిదైన మూడో ప్లేఆఫ్ బెర్త్ కూడా ఖరారైంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ దశకు అర్హత సాధించగా.. ఈ రెండు జట్ల సరసన యూపీ వారియర్స్ కూడా చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ ను ఓడించింది. యూపీ వారియర్స్ గెలుపుతో గుజరాత్, ఆర్సీబీ జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి.
Also Read : Ragi Java Benefits : రాగిజావతో ప్రయోజనాలెన్నో!
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు సాధించింది. హేమలత(33 బంతుల్లో 57 పరుగులు, 6 ఫోర్లు, 3 సిక్సులు), యాష్లే గార్డ్ నర్ (39 బంతుల్లో60, 6ఫోర్లు, 3 సిక్సులు) దూకుడుగా ఆడి అర్థ సెంచరీలు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పార్శవి చోప్రా రెండు వికెట్లు చొప్పున తీశారు. అనంతరం యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి విజయం సాధించింది.
Also Read : Delhi : నేడు మరోసారి ఈడీ ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన యూపీ వారియర్స్ ను తాలియా (38బంతుల్లో 57, 11 ఫోర్లు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 72, 7ఫోర్లు, 4 సిక్సులు) ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్ కు 78 పరుగులు జోడించారు. తాలియా అవుటయ్యాక గ్రేస్ హారిస్ యూపీని విజయం దిశగా నడిపించింది. ఏడు బంతులు మిగిలి ఉండగా హారిస్ పెవిలియన్ చేరగా.. సోఫీ ఎకిల్ స్టోన్ (13 బంతుల్లో 19 నాటౌట్, 2 ఫోర్లు ) యూపీ విజయాన్ని ఖాయం చేసింది.