ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గులాబో దేవి కాన్వాయ్ మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆమె కాన్వాయ్ ఢిల్లీ నుంచి బిజ్నోర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పిల్ఖువా కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారి-9పై కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో గులాబో దేవి ప్రయాణిస్తున్న కారు కూడా ఢీకొట్టింది. గాయాలపాలైన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భద్రతా సిబ్బంది, ఆమెతో పాటు ఉన్న ఇతర వాహనదారులు కూడా గాయపడినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. ప్రస్తుతానికి మంత్రి పరిస్థితిపై అధికారిక వైద్య బులెటిన్ విడుదల కాలేదు.
READ MORE: Vem Narender Reddy: రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోంది!
కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో గులాబో దేవి మాధ్యమిక విద్య మంత్రిగా (స్వతంత్ర బాధ్యత) పనిచేస్తున్నారు. ఆమె 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఐదవసారి గెలిచి, యోగి మంత్రివర్గంలో అత్యంత సీనియర్ మహిళా సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) అయ్యారు. గులాబో దేవి సంభాల్ జిల్లాలోని చందౌసి అసెంబ్లీ ఎమ్మెల్యే. రాజకీయాల్లోకి రాకముందు, ఆమె విద్యా రంగంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆమె మొదట చందౌసిలోని కన్యా ఇంటర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ టీచర్‌గా పనిచేశారు. అదే పాఠశాలలో ప్రిన్సిపాల్ బాధ్యతను కూడా చేపట్టారు.
