NTV Telugu Site icon

Rajasthan: ఆవు దూడపై అసహజ శృంగారం.. నిందితుడు అరెస్ట్

Rajasthan

Rajasthan

రాజస్థాన్​ అల్వార్​ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఆవు దూడతో అసహజ శృంగారంకు పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. కొందరు యువకులు అకృత్యాలకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. దీంతో.. ఈ వ్యవహారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన అజ్మీర్ జిల్లాలోని అల్వార్గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆవులతో అకృత్యాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జులై 1న ఆ ప్రాంత వాసి ప్రియాంషు అనే కామాంధుడు రాత్రి వేళల్లో ఆవుపై అసహజ శృంగారం చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వీడియో ఆధారంగా.. నాలుగు గంటల్లోనే అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Read Also: Team India: జింబాబ్వే టూర్లో మార్పులు.. ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం

కొన్ని మీడియా కథనాల ప్రకారం.. నిందితుడు గత 10-15 రోజులుగా ఆవు దూడపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే.. కొద్దిరోజులుగా ఆవు ఆరోగ్యం క్షీణించడంతో అనుమానం వచ్చిన ఆవు యజమాని.. గోశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత నిందితుడు దూడతో అసభ్యంగా ప్రవర్తించడం సీసీటీవీలో బయటపడింది. దీంతో వెంటనే ఆవు యజమాని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పాటు సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు చూపించాడు. ఎట్టకేలకు గ్రామ ప్రజలు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అయితే.. ఆవులపై అత్యాచారం చేయాలనే ఉద్దేశ్యంతోనే నిందితుడు అక్కడికి వచ్చేవాడని యజమాని చెప్పాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయాలని కొన్ని హిందూ సంస్థల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Sudheer Bose: సినీ డైరెక్టర్ కన్నుమూత.. ఏమైందంటే?