Team India: జింబాబ్వే టూర్లో మార్పులు.. ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం
- జింబాబ్వే టూర్లో మార్పులు
- ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం
- సాయి సుదర్శన్.. జితేష్ శర్మ.. హర్షిత్ రాణాలకు చోటు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై నెలలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అందుకోసం బీసీసీఐ టీమ్ను కూడా ప్రకటించింది. జింబాబ్వేతో మొత్తం ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. జూలై 6 నుండి జూలై 14 వరకు మ్యాచ్ లు జరుగనున్నాయి. అందుకోసం టీమిండియా బయల్దేరి వెళ్లింది. అయితే.. ఇంతకుముందు ప్రకటించిన టీమిండియా జట్టులో స్వల్ప మార్పులు చేసింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం కల్పించింది బీసీసీఐ. ఈ టూర్ లో సంజూ శాంసన్, శివం దూబే, యశస్వి జైస్వాల్ స్థానంలో.. సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు చోటు ఇచ్చింది బీసీసీఐ. ఈ సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తారు.
దేశం మొత్తం ఇంకా టీ20 వరల్డ్ కప్ గెలిచిన మూడ్‌లోనే ఉంది. అయితే.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసినా.. భారత జట్టు ఇంకా వెస్టిండీస్‌లోనే ఉంది. హరికేన్ తుపాను కారణంగా విమాన సర్వీసులన్నీ రద్దు కావడంతో భారత ఆటగాళ్లు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వరల్డ్ కప్ ముగించుకుని.. జింబాబ్వే టూర్‌కు వెళ్లాల్సిన శాంసన్, దూబే, జైస్వాల్‌లు అందుబాటులో లేకపోవడంతో ఐపీఎల్‌లో సత్తా చాటిన ఈ ముగ్గురిని సెలెక్టర్లు ఎంపిక చేశారు.
Also Read
Read Also: Asaduddin Owaisi : లోక్‌సభలో బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఒవైసీ..
జింబాబ్వేతో జరిగే టీ20లకు టీమిండియా జట్టు:
శుభ్ మన్ గిల్ (కెప్టెన్)
రుతురాజ్ గైక్వాడ్
అభిషేక్ శర్మ
రింకూ సింగ్
ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)
రియాన్ పరాగ్
వాషింగ్టన్ సుందర్
రవి బిష్ణోయ్
అవేశ్ ఖాన్
ఖలీల్ అహ్మద్
ముకేష్ కుమార్
తుషార్ దేశ్ పాండే
సాయి సుదర్శన్
జితేష్ శర్మ (వికెట్ కీపర్)
హర్షిత్ రాణా
🚨 NEWS 🚨
Sai Sudharsan, Jitesh Sharma and Harshit Rana added to India’s squad for first two T20Is against Zimbabwe.
Full Details 🔽 #TeamIndia | #ZIMvINDhttps://t.co/ezEefD23D3
— BCCI (@BCCI) July 2, 2024
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!