Site icon NTV Telugu

Ram Mohan Naidu: “నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు.. ఆ బాధ నాకు తెలుసు”

Ram Mohan Naidu

Ram Mohan Naidu

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘోర విమాన దుర్ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలో సహాయచర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గుజరాత్‌ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు స్పష్టం చేశారు.

READ MORE: NEET Score Scam: ముంబైలో వెలుగు చూసిన నీట్ స్కోర్ బాగోతం.. రూ. 90 లక్షలు డిమాండ్!

ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మంటలార్పి.. మృతదేహాలను అక్కడి నుంచి తరలించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దుర్ఘటనపై విచారణకు తక్షణమే ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అవసరమైతే మరికొంత మంది సభ్యులనూ బృందంలో చేరుస్తామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఘటనాస్థలిలో బ్లాక్స్‌బాక్స్‌ దొరికిందని… దానిని విశ్లేషించిన తర్వాత ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తుందన్నారు. అందులో ఏముందో తెలుసుకునేందుకు మేమూ ఆతృతగా ఎదురుచూస్తున్నామని తెలిపారు.

READ MORE: Atchannaidu: రైతులు మామిడి సాగుతో పాటు ఇతర లాభసాటి పంటలపై దృష్టి సారించాలి

దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాల బాధను అర్థం చేసుకోగలనన్నారు. తన తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారన్నారు. ఆ బాధ తనకు కూడా తెలుసన్నారు. హోంశాఖ సెక్రెటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారులతో, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సంపూర్ణ దర్యాప్తు జరిపేందుకు ఈ కమిటీ సభ్యులు దోహదపడతారని.. నిపుణుల విచారణ పూర్తయ్యాక తగిన సమయంలో మీడియాకు సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు.

 

Exit mobile version