అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘోర విమాన దుర్ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలో సహాయచర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు స్పష్టం చేశారు.
ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు ప్రాంతాల నుంచి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అన్నారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూకశ్మీర్…
సైదాబాద్ ప్రాంతానికి చెందిన చిన్నారిపై.. కామోద్రేకంతో రాజు అనే యువకుడు చేసిన పైశాచికత్వం.. యావత్ దేశాన్ని కదిలిస్తోంది. సామాన్యులనే కాదు.. సమాజంలోని సర్వ శక్తులూ.. ఆ బాధిత కుటుంబం వైపే చూసేలా చేస్తోంది. వారం రోజులుగా.. ప్రతి ఒక్కరూ.. ఆ వార్తనే ప్రసారం చేస్తున్న తీరుతో.. జనాల్లో భావోద్వేగం పెరుగుతోంది. ఈ తీరును గమనించిన రాజకీయ పార్టీల నేతలు సైతం.. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక్కడే.. కొందరు ఓ విషయంపై…