అక్టోబర్ 15 మంగళవారం కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పూడూరులో వీఎల్ఎఫ్ స్టేషన్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని పూడూర్ గ్రామంలో వీఎస్ఎఫ్ స్టేషన్/నేవల్ బేస్ ఏర్పాటుపై కేంద్రానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత పదేండ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే నేవల్ ప్రాజెక్ట్‌కు తుది ఆమోదం తెలిపిందని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. వికారాబాద్ మండలం పూడురు పరిధిలోని దామగూడెం రిజర్వు ఫారెస్ట్ లో 1174 హెక్టార్ల భూమిని (2900 ఎకరాలు) ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు బదిలీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 12, 2017న జీవో నెం.44 జారీ చేసినట్లు తెలిపింది. అటవీ సంరక్షణ చట్టం, 1980లోని సెక్షన్-2 ప్రకారం విశాఖపట్నంలోని హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్‌కు అనుకూలంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
READ MORE: Minister Nara Lokesh: స్టార్టప్ ఆంధ్ర నినాదం మాత్రమే కాదు… పాలనా విధానాన్ని మార్చే ఆయుధం
అప్పుడు బీఆర్ఎస్ తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్టును ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టును వ్యతిరేకించడం, ముందుగా ఆమోదించి ఇప్పుడు రాజకీయం చేయటం కేటీఆర్ నిజస్వరూపాన్ని తెలియజేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆయ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ భద్రత ప్రాధాన్యం దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు.
READ MORE: Viral Video: వీధిలో నడుస్తుండగా.. మహిళపై పడిన వాటర్ ట్యాంక్! అదృష్టం అంటే ఇదేమరి