Union Minister Parshottam Rupala: ప్రధానమంత్రి యోజన పథకం కింద ఏపీకి రూ.2,500 కోట్ల అదనపు నిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Parshottam Rupala: ప్రధానమంత్రి యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు ఇతర రాష్ట్రాల కంటే అధికంగా రూ.2 వేల 500 కోట్ల మేర నిధులు ఇచ్చామని తెలిపారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. నెల్లూరు నగరంలోని వీఆర్ కళాశాల మైదానంలో జరుగుతున్న సింహపురి సేంద్రియ మేళాను ఏపీ మంత్రి అప్పలరాజు, ఎంపీలు బీద మస్తాన్ రావు, జీవీఎల్ నరసింహారావు, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి పరిశీలించారు.. సేంద్రియ, మత్య్స ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, చిరుధాన్యాల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సముద్ర పరిక్రమ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నానని తెలిపారు.. దేశంలో మూడు కోట్ల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి.. వీరి సంక్షేమం కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని రూ.20 వేల కోట్లతో తీసుకువచ్చారు.. దేశానికి ఎంతో తీర ప్రాంతం ఉంది.. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ నుంచి దేశం మొత్తం మీద 30 శాతం సముద్ర ఆహార ఉత్పత్తులు వస్తున్నాయని వెల్లడించారు.
Read Also: Minister Seediri Appalaraju: రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..!
Also Read
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
సముద్ర పరిక్రమకార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలలో పర్యటిస్తున్నాను అని తెలిపారు పురుషోత్తం రూపాలా.. మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేయడంతో పాటు స్పెషల్ అండ్ సెంటర్లో హార్బర్లను కూడా అభ్యసిలిస్తున్నాం అన్నారు. ఒక గ్రామంలో మత్స్యకార గ్రామంలోకి వెళ్లి మత్స్యకారుల ఇంటికి వెళ్లి కూర్చొని మాట్లాడడం వంటి అవకాశం కేవలం మోడీ ప్రభుత్వంలో సముద్ర ప్రతిని కార్యక్రమం ద్వారానే సాధ్యమైందన్నారు. ఇక, ప్రధానమంత్రి యోజన పథకం కింద ఏపీకి ఇతర రాష్ట్రాల కంటే అధికంగా రూ.2,500 కోట్ల మేర నిధులు ఇచ్చాం.. ఆంధ్రప్రదేశ్ మంత్రి అప్పలరాజు మరో రెండు ప్రాజెక్టులు అడిగారు.. వాటిని కూడా పరిశీలిస్తాం అన్నారు. ఇక, చేపల ఉత్పత్తులను అమూల్ సంస్థ తరహాలో సహకార రంగం ద్వారా మార్కెటింగ్ చేయాలన్నారు.. మత్స్యకారులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా ఇస్తున్నాం.. ఆంధ్ర ప్రదేశ్ లోని మత్స్యకారులకు కూడా ఈ కార్డులు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా.
తాజావార్తలు
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!