Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Union Minister Nityanand Rai In Bihar Cm Race

Bihar: బీహార్ సీఎం రేసులో కేంద్రమంత్రి! అభిమానులు సంబరాలు

Published Date :March 5, 2026 , 4:15 pm
By Suresh Maddala
  • పెద్దల సభకు సీఎం నితీష్ కుమార్
  • తదుపరి బీహార్ సీఎం రేసులో కేంద్రమంత్రి!
  • మెండుగా హైకమాండ్ పెద్దల ఆశీస్సులు
Bihar: బీహార్ సీఎం రేసులో కేంద్రమంత్రి! అభిమానులు సంబరాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీహార్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఊహించని షాకిచ్చారు. రాజ్యసభకు వెళ్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా బాంబ్ పేల్చారు. దీంతో బీహార్‌తో పాటు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా వేగంగా రాజకీయాలు మారిపోయాయి. ఇక గురువారం రాజ్యసభకు నితీష్ కుమార్ నామినేషన్ దాఖలు చేసేశారు.

నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోవడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దక్కుతుందని జేడీయూ వర్గాలు తెలిపాయి. రెండు ఉపముఖ్యమంత్రి పదవులు మాత్రం జేడీయూకు దక్కుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అయితే ముఖ్యమంత్రి రేసులోకి కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ ముందు వరుసలోకి వచ్చారు. బీహార్ తదుపరి ముఖ్యమంత్రి నిత్యానంద్ రాయ్ కావడం ఖాయంగా బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీలో నిత్యానంద్ రాయ్ చాలా సీనియర్ నేతగా ఉన్నారు. అమిత్ షాతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన ఆశీస్సులు చాలా మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యానంద్ రాయ్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నిత్యానంద్ రాయ్.. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఉజియార్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అంతకముందు 2000 సంవత్సరం నుంచి హాజీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ సీటు. గతంలో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం నిత్యానంద్ రాయ్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైశాలి జిల్లాలోని కర్ణపుర గ్రామంలోని నిత్యానంద రాయ్ పూర్వీకుల ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. హోలీ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా సంబరాలు చేసుకుంటుండంతో చర్చల్లోకి వచ్చింది

మరోవైపు సామ్రాట్ చౌదరి కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే తొలిసారి బీహార్‌లో బీజేపీ సీఎం పీఠాన్ని అధిరోహిస్తున్న నేపథ్యంలో అణగారిన వర్గాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిత్యానంద్ రాయ్ వైపు హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. నితీష్ వారసుడు ఎవరో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Bihar CM race
  • bjp
  • Next Bihar chief minister
  • Nityanand Rai

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..

  • MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!

  • Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..

  • Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్‌ ఫ్రాడ్‌ కేసులో రమావత్‌ మధు అరెస్టు.

  • Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions