Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ కేవలం 13 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అతి పిన్న వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ (రంజీ ట్రోఫీ) ఆడిన రికార్డు సృష్టించిన ఈ కుర్రాడు, ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ద్వారా రూ. 1.10 కోట్లకు అమ్ముడు కావడంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వైభవ్, అండర్-19 టెస్టుల్లో ఆస్ట్రేలియాపై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ బాది తన దూకుడును చాటుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ లో బౌలర్లపై ఓ రేంజిలో విరుచుకుపడుతున్నాడు. చిన్న వయసులోనే ఇంతటి పరిణతి, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తుండటంతో అతడిని భారత క్రికెట్ తదుపరి సూపర్‌స్టార్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు.
బిసిసిఐకి వైభవ్ ఎంపిక ఎందుకు సవాలుగా మారింది..?
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే టీమ్ ఇండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ కోసం 13 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయడంపై బీసీసీఐ తీవ్రంగా యోచిస్తోంది. అయితే.. ఈ ఎంపిక సెలక్టర్లకు ఒక పెద్ద సవాల్‌గా మారింది.
ప్రస్తుతం జట్టులో అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి అగ్రశ్రేణి ఓపెనర్లు ఉన్నారు. వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలంటే వీరిలో ఎవరిని తప్పించాలనేది ఇప్పుడు ప్రధాన సమస్య. ఒకవేళ యువ రక్తాన్ని ప్రోత్సహించే క్రమంలో వైభవ్‌ను బరిలోకి దించితే.. సీనియర్ ఆటగాళ్ల స్థానాల విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read:Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..
మరోవైపు, కెప్టెన్సీ విషయంలోనూ మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా బ్యాటర్‌గా ఆశించిన స్థాయిలో రాణించని సూర్యకుమార్ యాదవ్‌ను ఈ పర్యటనకు పక్కన పెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే.. జట్టు పగ్గాలను అభిషేక్ శర్మ లేదా సంజు శాంసన్‌లకు అప్పగించే వీలుంది. ఐర్లాండ్ చిన్న జట్టు కావడంతో ప్రయోగాలకు ఇది సరైన సమయమని బీసీసీఐ భావిస్తోంది. వైభవ్‌కు అంతర్జాతీయ అరంగేట్రం కల్పిస్తూనే, జట్టులో సమతుల్యతను కాపాడటం మేనేజ్‌మెంట్‌కు ఇప్పుడు కత్తిమీద సాము వంటిదే. ఈ పర్యటన ద్వారా భారత టీ20 భవిష్యత్తుపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం కానుంది.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!