Ramavath Madhu : మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ కేసులో రమావత్ మధు అరెస్టు.
- రియల్ ఎస్టేట్ పేరిట భారీ మోసం
- లాభాల మాయలో పెట్టుబడిదారులు
- 33 మంది బాధితుల నుంచి కోట్ల వసూళ్లు
- ఈఓడబ్ల్యూ పోలీసుల అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టించిన మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. “శుభక్షేత్ర” అనే పేరుతో వెంచర్లు వేసి, అధిక లాభాలు ఆశజూపి కోట్లాది రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో ప్రధాన నిందితుడు రామావత్ మధును సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. పటాన్‌చెరు , దామరగిద్ద ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో ఈ దందా సాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Priyanka Gandhi: “చాణక్యుడు కూడా ఇలా ప్లాన్ చేయలేడు”.. ప్రియాంకా సెటైర్లపై అమిత్ షా నవ్వులు..
Also Read
ఈ స్కామ్‌లో హేమకాంత్ రెడ్డి, రామావత్ మధు, సత్యనారాయణ చౌదరి కీలక సూత్రధారులుగా వ్యవహరించారు. వీరు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అత్యంత ఆకర్షణీయమైన హామీలను ఎరగా వేశారు. ఒక ప్లాన్ ప్రకారం, తమ వద్ద పెట్టుబడి పెట్టిన వారికి 102 చదరపు గజాల ప్లాట్ ఇవ్వడమే కాకుండా, రాబోయే 42 నెలల పాటు నెలకు 25 వేల రూపాయల చొప్పున ఆదాయం అందిస్తామని నమ్మబలికారు. వీటికి అదనంగా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఇస్తామని మాయమాటలు చెప్పి సుమారు 33 మంది బాధితుల నుంచి భారీగా సొమ్ము సేకరించారు.
Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!
అయితే, బాధితులు డబ్బులు చెల్లించిన తర్వాత నిందితుల అసలు స్వరూపం బయటపడింది. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమని కోరగా, కేవలం ఒప్పంద పత్రాలతోనే కాలయాపన చేస్తూ బాధితులను తిప్పించుకోవడం మొదలుపెట్టారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుంభకోణం బయటపడింది. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) , తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం (TSPDFEA) కింద కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం రామావత్ మధును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?