Site icon NTV Telugu

Kishan Reddy: సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వాఖ్యలు..

Kishan Reddy

Kishan Reddy

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీల నేతలు విచిత్రమైన మానసిక వ్యాధి తో బాధపడుతున్నారని అన్నారు. వాళ్లకు బిజెపి ఫోబియా పట్టుకుందన్నారు. చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. బిజెపికి తెలంగాణ లో ఎవరితో కలవాల్సిన అవసరం లేదన్నారు. కెసిఆర్, కేటీఆర్, బిఆర్ఎస్, కాంగ్రెస్ లతో బిజెపి ఎప్పుడు కలవదని స్పష్టం చేశారు. కలిసి కాపురాలు చేసింది మీరు.. ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది మీరు.. మంత్రి పదవులు పంచుకుంది మీరు.. బిజెపికి ఎటువంటి అవసరం లేదు అని ఫైర్ అయ్యారు.

Also Read:CDS Anil Chauhan: చైనా యుద్ధంలో ఎయిర్‌ఫోర్స్ దాడికి అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు..

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా స్వతంత్రంగా పోటీ చేస్తాం.. టిఆర్ఎస్, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చేందుకే మా ప్రయత్నం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలి సమంజసంగా లేదు. ప్రజాప్రతినిధిగా.. తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని, ప్రజలకు మేలు జరగాలని కోరుకునే వ్యక్తుల్లో ముందువరసలో నేనుంటాను.. మా మంత్రిత్వ శాఖలో.. తెలంగాణ ప్రాజెక్టులకోసం స్పెషల్ సెల్ ఏర్పాటుచేసుకుని.. అన్నిరకాల అభివృద్ధి పనులను మానిటర్ చేస్తున్నాను.. మా పార్టీ తెలంగాణ అభివృద్ధికి చిత్త శుద్ధితో పనిచేస్తుంది.. రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో విషయంలో.. అందరికంటే ముందే మేం ప్రొయాక్టివ్ గా వ్యవహరించామని తెలిపారు.

ట్రిపుల్ ఆర్ కు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.. మెట్రో విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి.. ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తున్నప్పుడు.. చాలా విషయాలపై స్పష్టత కావాలని అడుగుతారు.. మెట్రో విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసినపుడు.. వారు చాలా స్పష్టంగా చెప్పారు.. ఇప్పుడు మెట్రో రైల్ నిర్వహిస్తున్న L&T, కొత్తగా నిర్మాణం చేపట్టనున్న కంపెనీ మధ్య ఏమైనా ఒప్పందం జరిగిందా అని ప్రశ్నించారు.. హైదరాబాద్ మెట్రో ఇప్పటికే నష్టాల్లో నడుస్తోంది.. ఇది రాష్ట్ర ప్రభుత్వంలోని అంశం. అది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. దీన్ని వారే తేల్చుకోవాలి.. మెట్రో అంశానికి అన్నిరకాలుగా మా సహకారం ఉంటుందని తెలిపారు.

కాళేశ్వరం పై సీబీఐ ప్రతిపాదనలు అందాయని పరిశీలనలో ఉందని తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ ఫోబియా పట్టుకుంది… రెండు పార్టీలు అర్థం పర్థం లేకుండా, ఆధారాల్లేకుండా.. మాట్లాడుతున్నారు. మీరు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. మేం ఇండిపెండెంట్ గా ముందుకెళ్తాం.. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా.. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచేస్తున్నాం.. బీసీ రిజర్వేషన్ పెరగాలని అసెంబ్లీలో మద్దతిచ్చాం.. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాదు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా.. 42% రిజర్వేషన్లు అమలు చేయాలి..

Also Read:CM Chandrababu: అలిపిరి బ్లాస్ట్‌లో నన్ను కాపాడింది ఆయనే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు..

జెన్ జీ విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు.. నేపాల్ లో జరిగినట్లుగా.. పీఎం ఇంటిపైనా, మంత్రుల ఇంటిపైనా.. న్యాయస్థానాలపైనా దాడులు జరిగినట్లుగా.. ఇక్కడ జరగాలని కేటీఆర్ భావిస్తున్నారా? బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఇక్కడ అమలవుతోంది.. దేశంలో సమర్థవంతమైన నాయకత్వం ఉంది. అభివృద్ధి వేగవంతంగా సాగుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. మనం వేగంగా పురోగతి సాధిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో.. కొందరు దివాళాకోరు మాటలు మాట్లాడం సరికాదు. ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version