NTV Telugu Site icon

Kishan Reddy: ఇంతకి ఇది హైడ్రా నా.. హై డ్రామానా?

Kishanreddy

Kishanreddy

ఇంతకి ఇది హైడ్రా నా హై డ్రామానా తెలియడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేసిందని ప్రశ్నించారు. అప్పుడు అధికారులు అనుమతులు యే ప్రాతిపదికన ఇచ్చారని నిలదీశారు. ప్రభుత్వం ఒక సమగ్రమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థలకు ప్లే గ్రౌండ్ లు లేవు… బహిరంగ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిపోయిందన్నారు. దేన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని చెప్పారు.

READ MORE: AP CM Chandrababu: నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి..

అనంతరం కేంద్ర మంత్రి జమ్ము కశ్మీర్ గురించి మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ లో జిన్నా రాజ్యాంగం ఉండేదని.. బీజేపీ 370 ఆర్టికల్ తొలగించిందని గుర్తు చేశారు. “జమ్మూలో నవంబర్, డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి.. అనుకున్నాం. ఇండి కూటమి చేస్తున్న దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకి హక్కులు కల్పించే విధంగా మేము నిర్ణయాలు తీసుకున్నాం. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి ఇతర దేశాలతో చర్చించే అధికారం లేదు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు అలా మాట్లాడుతున్నాయి… సోనియా ,రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.” అని ఆయన ప్రశ్నించారు.

READ MORE:State Election Commission: పంచాయతీ ఎన్నికలపై కీలక సమాచారం..!

ప్రపంచం లోనే బీజేపీ అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ అని.. 140 కోట్ల మంది ప్రజలు(ప్రతి భారతీయుడు) గర్వించాల్సిన అంశమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో మహిళలు, రైతులు, యువత టార్గెట్ గా సభ్యత్వం నమోదు చేసినట్లు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. “పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వర్గాలు బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా.. తెలంగాణలో పెద్దగా మార్పు రాలేదు. ప్రజలు ఈ రెండు పార్టీల పట్ల విసిగిపోయి ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. తెలంగాణ ప్రజలు తెలివిలేనోళ్ళు అనే విధంగా కేసీఆర్ కుటుంబం భావిస్తుంది. తమ అహంకారంతో ఓడి పోయామని అనుకోవడం లేదు. కేసీఆర్ మీద కోపంతో గ్యారంటీలు నమ్మి కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేశారు. శాసనసభకు ఎప్పుడు ఎన్నికలు జరిగిన పార్టీ గెలిచే విధంగా ముందుకు వెళ్తాం” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE: Champai Soren: కుమారులతో కలిసి ఢిల్లీకి వచ్చిన చంపై సోరెన్! బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం!

రేవంత్ రెడ్డి, కేటీఆర్ లు బీజేపీ స్పోక్ పర్శన్స్ అయిపోయారు. బీజేపీలో విలీనం అంటూ వాళ్ళే మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. చనిపోయాక ఆయన కూడా కాంగ్రెస్ జండా కప్పుకుని చనిపోవాలని అనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితిలో లేదని.. ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ దిక్కు దివాన లేకుండా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. పార్టీ ఫిరాయింపులను అప్పుడు బీఆర్ఎస్ ప్రోత్సహిస్తే… ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి ఏర్పడిందని.. అసమర్థతను, ఓటు బ్యాంక్ రాజకీయాలను కేంద్ర ప్రభుత్వం మీద నెపం మోపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ కాలేదు.. కాంగ్రెస్ చెప్పిన ప్రజా పాలన రాలేదన్నారు.