JP Nadda: సీఎం రేవంత్ విజ్ఞప్తిని స్వీకరించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా
- ఖరీఫ్ సీజన్లో గరిష్టంగా డిమాండ్ ఉంటుందంటూ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన సీఎం
- సీఎం విజ్ఞప్తిని స్వీకరించిన కేంద్ర మంత్రి .. రైతుల డిమాండ్ ను నెరవేర్చే దిశగా ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరిగణలోకి తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్లో గరిష్టంగా డిమాండ్ ఉంటుందంటూ కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
సీఎం విజ్ఞప్తిని స్వీకరించిన కేంద్ర మంత్రి.. తెలంగాణ రాష్ట్ర రైతుల డిమాండ్ ను నెరవేర్చే దిశగా ఆదేశాలు జారీ చేశారు. అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల భూమిలోని సారం తగ్గిపోతుందంటూ ముఖ్యమంత్రికి సూచించారు.
READ MORE: Air India Crash: ఇంజన్ “ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్” తప్పిదమే ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణమా.?
Also Read
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్‌రావు ఫైర్..
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్‌డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
2023- 24 రబీతో పోలిస్తే 2024- 25 లో 21% అదనంగా యూరియా అమ్మకాలు జరిగాయని కేంద్రమంత్రి వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటివరకు 12.4% అదనపు వినియోగం జరిగిందని తెలిపారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియాను దారి మళ్ళించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఎరువులు సేంద్రీయ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు PM PRANAM పథకం గురించి ఎరువుల శాఖ కార్యదర్శి రంజిత్ కుమార్ మిశ్రా తెలంగాణ అధికారులకు వివరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఎరువుల సమన్వయాన్ని చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్‌రావు ఫైర్..
-
Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్‌డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..