S. Jaishankar: ప్రధాని ఉక్రెయిన్ పర్యటనను ‘చారిత్రాత్మకంగా’ అభివర్ణించిన కేంద్రమంత్రి..
- ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ
- మోడీ పర్యటనను 'చారిత్రాత్మకం' అని అభివర్ణించిన కేంద్ర విదేశాంగ మంత్రి
- ప్రధాని మోడీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ తొలిసారి ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ‘చారిత్రాత్మకం’ అని అభివర్ణించారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగమని పేర్కొన్నారు. వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధాలు, వ్యవసాయం, విద్య రంగాలపై మోడీ-జెలెన్స్కీ మధ్య చర్చ జరిగినట్లు జైశంకర్ తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను పునర్నిర్మించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రధాని మోడీ, జెలెన్స్కీ ఇంటర్-గవర్నమెంటల్ కమిషన్‌కు బాధ్యత వహించారు. ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ప్రధాన చర్చ ఉక్రెయిన్‌లో యుద్ధంపైనే జరిగిందని జైశంకర్ అన్నారు. శాంతిభద్రతల పునరుద్ధరణకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.
Nirmal Benny: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
చర్చల అనంతరం ఇరువురు నేతలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, వైద్యం, సంస్కృతి.. మానవతా సహాయం రంగాలలో సహకారాన్ని అందిస్తాయని అధికారులు తెలిపారు. 1991లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇరుపక్షాలు పరస్పర చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని భారత్ విశ్వసిస్తోందని జైశంకర్ తెలిపారు.
PM Modi: ‘భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది’.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోడీ ఆహ్వానించారని జై శంకర్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన సౌలభ్యం మేరకు భారతదేశాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు జై శంకర్ పేర్కొన్నారు. రష్యాపై విధించిన ఆంక్షలకు సంబంధించి.. భారత్ సాధారణంగా ఏ దేశంపైనా ఆంక్షలు విధించదని చెప్పారు. ఇది మన రాజకీయ, దౌత్య సంప్రదాయంలో భాగం కాదని.. తాము సాధారణంగా UN ఆంక్షలకు కట్టుబడి ఉంటామని కేంద్రమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!