NTV Telugu Site icon

Bandi Sanjay : అప్పుడు బీఆర్ఎస్ నరికింది.. కాంగ్రెస్ ఇంకా ఎక్కువగా నరుకుతోంది..

Bandi Sanjay

Bandi Sanjay

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో హరిత విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా తెలిపారు. ముందు బీఆర్ఎస్ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ చేస్తుందని పేర్కొన్నారు. “బీఆర్‌ఎస్ 25 లక్షల చెట్లు కాళేశ్వరం కోసం నరికేసి, హరితహారం పేరుతో కొనోకార్పస్ కల్లోలం తెచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కంచ, గచ్చిబౌలిలో చెట్లు నరికి ప్రకృతి నాశనం చేస్తోంది. గొడ్డలి మారలేదు, పట్టిన చేతులు మారాయి. తెలంగాణలో పాలన లేదు. అది అటవీ నాశన మాఫియాద్వారా బందీ అయింది.” అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

READ MORE: High Tension In Ramagiri: అనంతపురంలో రాజకీయ వేడిని రాజేసిన వైసీపీ కార్యకర్త మృతి.. మాజీ ఎంపీ గోరంట్ల ఫైర్!

కాగా.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం ఉగాది రోజున జేసీబీలతో వందల సంఖ్యలో పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి భూములను చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసి వందలమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగటంతో అందరినీ ఈడ్చుకెళ్లి లారీల్లో పడేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఆదివారం సెలవు దినం, ఉగాది పర్వదినం కూడా కావటంతో క్యాంపస్‌లో ఉదయం వాతావరణం ప్రశాంతంగానే మొదలైంది. కొద్ది సేపటికే పోలీసులు తండోప తండాలుగా వచ్చి క్యాంపస్‌లోని అన్ని అంతర్గత రోడ్లను ఆ«దీనంలోకి తీసుకొని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈస్ట్‌ క్యాంపస్‌ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. వర్సిటీ ప్రహరీ లోపలి భూములను జేసీబీలతో చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసిన విద్యార్థులు రోడ్లపైకి దూసుకొచ్చారు. నేడు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.

READ MORE: Tirumala: తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వ్యక్తి హల్ చల్!