Harish Rao : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణాన్ని ఎలా అణిచివేస్తుందో, అది ఎంత భయానకంగా, బాధ్యతారాహిత్యంగా సాగుతోందో ఇప్పుడు దేశానికి, ప్రపంచానికి తేటతెల్లమైందని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో సుప్రీం కోర్టులో జరిగిన వాదనలు, ప్రభుత్వ నైపుణ్యానికి బదులుగా నిరంకుశత్వాన్ని ఉద్ఘాటించాయని ఆయన అన్నారు. సెలవు దినాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం బుల్‌డోజర్లతో భూవిధ్వంసానికి పాల్పడడంపై సుప్రీంకోర్టు చేసిన గంభీర వ్యాఖ్యలు, కాంగ్రెస్…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలని యత్నిస్తున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలో ఉందని, అటువంటి భూమిని కేంద్ర అనుమతి లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని అన్నారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూవివాదంపై హైకోర్టులో కేసు నడుస్తోందని బండి సంజయ్ గుర్తు చేశారు. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఏప్రిల్ 7…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో హరిత విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా తెలిపారు. ముందు బీఆర్ఎస్ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ చేస్తుందని పేర్కొన్నారు. "బీఆర్‌ఎస్ 25 లక్షల చెట్లు కాళేశ్వరం కోసం నరికేసి, హరితహారం పేరుతో కొనోకార్పస్ కల్లోలం తెచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కంచ, గచ్చిబౌలిలో చెట్లు నరికి ప్రకృతి నాశనం చేస్తోంది. గొడ్డలి మారలేదు, పట్టిన…