Amit Shah Fire ON Brs, Congress parties: జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ మైదానంలో జరిగిన సభలో బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బైరాన్ పల్లిలో రజాకార్ల చేతిలో అమరులైన వారికి నివాళులర్పిస్తున్నామని చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ, ఇతర నాయకులకు భయపడి కేసీఆర్ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని విస్మరించారు అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి చూపెడతామని ఆయన కామెంట్స్ చేశారు. బైరాన్ పల్లిలో అమరుల స్మారక స్థూపాన్ని నిర్మిస్తాం.. గత ఎన్నికలలో కేసీఆర్ ఇచ్చిన పాలిటెక్నిక్ కళాశాల హామీ నెరవేర్చలేదు.. అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి భూ కబ్జాలకు పాల్పడే వాళ్ళు అని అమిత్ షా విమర్శలు గుప్పించారు.
Read Also: Chelluboina Venugopalkrishna: కులాలకు ఆత్మగౌరవ రక్షకుడు జగన్
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు 2జీ, 3జీ, 4జీలు.. బీజేపీ 2జీ, 3జీ, 4జీ కాదు తెలంగాణ ప్రజల పార్టీ అని అమిత్ షా అన్నారు. మోడీ కృషితోనే చంద్రాయన్ విజయవంతం అయింది.. ఇప్పటి వరకు ఏ పార్టీ చేయని విధానంగా బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అవినీతి రాష్ట్రంగా ఉంది అని ఆయన విమర్శలు చేశారు. బీజేపీ వచ్చాక తెలంగాణలోని అవినీతి పరులను జైలుకు పంపుతాం.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలా అన్నిట్లో కేసీఆర్ కమిషన్ నడుస్తుంది.. బీజేపీ వస్తే పేదలకు 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది.. జనవరిలో మోడీ అయోధ్యలో రామచంద్ర విగ్రహాలను ప్రతిష్టంచనున్నారు అని అమిత్ షా వెల్లడించారు. బీజేపి అయోధ్యలో రాముడి దర్శనం ఉచితంగా చేయిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. 2024లో మూడో సారి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేద్దామని అమిత్ షా పిలుపునిచ్చారు.