రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్న పరిస్థితుల్లో.. సైబర్ నేరాలు సైతం అధికంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా చైనా అధారిత యాప్‌లు ప్రజల సమాచారాన్ని దొంగలిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అయితే ఇందులో నిజం లేకపోలేదు. అయితే.. దీంతో చైనా ఆధారిత యాప్‌లపై దృష్టి సారించిన కేంద్రం ప్రభుత్వం కొన్ని యాప్స్‌ను ఇప్పటికే బ్యాన్ చేసింది. అయితే.. ఇప్పుడు మరో 348 యాప్స్‌ను బ్యాన్ చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. దేశం బయట ఉన్న సర్వర్‌లకు అనధికారిక పద్ధతిలో వినియోగదారుల సమాచారాన్ని ప్రసారం చేసినందుకు హోం మంత్రిత్వ శాఖ గుర్తించిన 348 మొబైల్ అప్లికేషన్‌లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు బుధవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో ఈ యాప్‌లను చైనాతో సహా వివిధ దేశాలు అభివృద్ధి చేశాయని తెలిపారు.
“MHA నుండి అభ్యర్థన ఆధారంగా, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆ 348 మొబైల్ అప్లికేషన్‌లను బ్లాక్ చేసింది, ఎందుకంటే ఇటువంటి డేటా ట్రాన్సర్ భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రత, భారతదేశం యొక్క రక్షణ మరియు రాష్ట్ర భద్రతకు భంగం కలిగిస్తాయి” అని ఆయన వెల్లడించారు. ఈ 348 యాప్‌లను మెయిటీ బ్లాక్ చేసిన సమయం గురించి ప్రస్తావించలేదు.