Copper IUD: కాపర్ టీ లేదా ఐయూడీ (ఇంట్రా యూటరైన్ డివైస్) అనేది గర్భధారణ నిరోధక పద్ధతుల్లో అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా భావించబడుతుంది. ఇది శారీరకంగా గర్భధారణను నిరోధిస్తుంది. అయితే, చాలా మంది మహిళలు దీని గురించి అపోహలు కలిగి ఉండటం లేదా అసౌకర్యంగా అనిపించడం వల్ల దీన్ని ఉపయోగించేందుకు వెనుకాడతారు. కాపర్ టీ అనేది సురక్షితమైన, దీర్ఘకాలిక గర్భ నిరోధక పద్ధతి. దీని ఉపయోగం శృంగార జీవితంపై పెద్దగా ప్రభావం చూపదు. కానీ, చిన్న సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించడం మంచిది. అపోహల్ని వీడి, వైజ్ఞానికంగా దీన్ని అర్థం చేసుకోవడం మహిళల ఆరోగ్యం, సంక్షేమానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా, కాపర్ టీ వల్ల లైంగిక జీవితం ప్రభావితమవుతుందని అనుకునే వారు కూడా ఉన్నారు. ఆందోళనలను తొలగించేందుకు కాపర్ టీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఒకసారి చూద్దాం.
Also Read: Jishnu Dev Varma: నేడు మెదక్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన..
* లైంగిక జీవితంపై కాపర్ టీ ప్రభావం ఉందా?
సాధారణంగా, కాపర్ టీ లైంగిక జీవితంపై ఎటువంటి ప్రభావం చూపదు. అయితే, వ్యక్తిగత అనుభవాలు వ్యక్తి నుంచి వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు. నివేదికల ప్రకారం, కాపర్ టీ ఉపయోగించే సమయంలో కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉత్సాహం, లైంగిక సమయంలో అసౌకర్యం అనిపించవచ్చు. దీనికి పలు కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు ఐయూడీ సరైన స్థితిలో లేకపోవడం వంటి కారణాలవల్ల జరగవచ్చు.
కాపర్ టీ కారణంగా శృంగార సమయంలో నొప్పి?
ఒకవేళ ఐయూడీ సరైన స్థానంలో ఉంటే శృంగార సమయంలో ఏ విధమైన నొప్పి ఉండదు. అయితే, నొప్పి అనిపిస్తే అది ఐయూడీ యూటరస్ నుంచి బయటకు ఉండవచ్చని సూచిస్తుంది. అలా జరిగితే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలి.
Also Read: Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. కిక్కిరిసిన స్టేడియం
కాపర్ టీ వల్ల గర్భాశయం సమస్యలు లేదా ఇన్ఫర్టిలిటీ సమస్యలు?
కాపర్ టీ వల్ల గర్భాశయం సమస్యలు లేదా ఇన్ఫర్టిలిటీ ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఐయూడీ ఉపయోగం వలన ఓవ్యూలేషన్ ఆగిపోవడం లేదా ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వంటి సమస్యలు రావని నివేదికలు చెబుతున్నాయి. ఇది గర్భధారణను మాత్రమే నిరోధిస్తుంది కానీ ప్రసవ సామర్థ్యాన్ని తగ్గించదు.
ఐయూడీతో శృంగారం చేసేప్పుడు ఏమి అనుసరించాలి?
ఇలాంటి సమయంలో అతి చిన్న నిర్లక్ష్యం కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్‌లకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి హైజీన్‌పై దృష్టి పెట్టాలి. అలాగే సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ (STIs) నివారించేందుకు కండోమ్స్ ఉపయోగించాలి.
ఐయూడీ సరైన స్థితిలో ఉందని నిర్ధారించుకోవడానికి అప్పుడప్పుడు నిపుణుడిని కన్సల్ట్ చేయాలి.