Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. చురు జిల్లా రతన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడలిపై కన్నేసిన మామ ఆమెపై అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచాడు. మహిళా పోలీసు అధికారి ఇంద్రలాల్ మహర్షి తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలికి సర్దర్శహర్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. ఒక రాత్రి ఆమె బాత్రూంకి వెళ్ళింది. అదే సమయంలో ఆమె వెళ్లడం భర్త మామ చూశాడు. ఆ సమయంలోనే కొడుకు పనిమీద బయటికి వెళ్లాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. ఆమెను అనుసరించి లోపలికి కూడా వెళ్లాడు.
Read Also: ChatGPT : సంసారాల్లో చిచ్చు పెడుతున్న చాట్ జీపీటీ.. హాంకాంగ్ లో ఘటన
మామ లోపలికి రాగానే సదరు మహిళ షాక్ కు గురైంది. వెంటనే భయపడి కేకలు వేయడం ప్రారంభించింది. అయితే నిందితుడు అతని దగ్గర ఉన్న కత్తిని బయటకు తీశాడు. అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. అక్కడే ఆమెను అతి క్రూరంగా అనుభవించి బాత్రూం గడియ పెట్టి పారిపోయాడు. బాధితురాలు తేరుకుని ఇంట్లోకి వచ్చి ఆమె అత్తగారికి చెప్పింది. కానీ అదే సమయానికి నిందితుడైన మామ విక్రమ్ కూడా అక్కడికి వచ్చాడు. ఆమె అబద్ధం చెబుతుందని బాధితురాలిని ముగ్గురు తీవ్రంగా కొట్టారు.
Read Also: H3N8 Bird Flu: చైనాలో బర్డ్ ఫ్లూతో ఒకరు మృతి.. ప్రపంచంలోనే తొలి కేసుగా నమోదు..
ఇదంతా బాధితురాలి తల్లికి తెలియడంతో వెంటనే కూతురిని తీసుకుని మెట్టినింటికి వెళ్లింది. మళ్లీ వారిద్దరినీ తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు. ఎలాగోలా వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయి రతన్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కానీ పోలీసులు రాత్రి రెండు తెల్లకాగితాలపై బాధితురాలి సంతకం తీసుకుని ఉదయం కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత బాధితురాలు మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విక్రమ్‌పై కేసు పెట్టింది. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. తదుపరి విచారణ జరుపుతున్నారు.