Keir Starmer Aadhaar: బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఇటీవల ముంబై పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా ఆయన భారతదేశ ఆధార్ వ్యవస్థపై ప్రశంసలుకురిపించారు. ఈ వ్యవస్థ తనను ఆకట్టుకుందని, బ్రిటన్ కొత్త డిజిటల్ గుర్తింపు పథకం.. బ్రిట్ కార్డ్ కోసం దీనిని ఒక నమూనాగా ఉపయోగించాలని ఆలోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఆధార్ అనేది ప్రతి భారతీయ పౌరుడికి జారీ చేసిన డిజిటల్ ఐడి నంబర్.
READ ALSO: Huawei Nova Flip S: హువావే కొత్త ఫోల్డబుల్ ఫోన్ 2.14-అంగుళాల కవర్ స్క్రీన్‌తో విడుదల.. ధర ఎంతంటే?
ఆధార్ ప్రత్యేకలు..
ఆధార్ కార్డులో పౌరుల గురించి సమాచారం, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు వంటి బయోమెట్రిక్స్ ఉంటాయి. ఇది ప్రభుత్వ ప్రయోజనాలు అర్హులకు చేరేలా, దేశంలో మోసాలను తగ్గించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది. అయితే బ్రిటన్ ప్రభుత్వం వారి దేశంలో ప్రవేశపెట్టనున్న బ్రిట్ కార్డు ప్రణాళిక దీనికి కొంత భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి బ్రిట్ కార్డు లక్ష్యం ఏమిటంటే.. అక్రమ కార్మికులను నిరోధించడం. దీని ద్వారా సరైన వ్యక్తులు మాత్రమే ప్రభుత్వ సేవలను పొందుతారు. అయితే దేశంలోని నివాసితులు దీని రాకతో తమ గోప్యతకు ఏమైనా ఇబ్బందులు రావచ్చు అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీంతో ప్రభుత్వ నిఘా తమపై పెరుగుతుందని భావిస్తున్నారు.
కీర్ స్టార్మర్ ముంబై పర్యటన సందర్భంగా.. ఆయన ఆధార్ సృష్టికర్త అయిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనిని కూడా కలిశారు. భారతదేశంలో ఆధార్ అనుభవాలను ఉపయోగించుకుని, UKలో బలమైన, సురక్షితమైన డిజిటల్ ID వ్యవస్థను నిర్మించడం గురించి వాళ్లిద్దరూ చర్చించారు. భారతదేశంలో ఆధార్ అనేక ప్రభుత్వ పనులను సులభతరం చేసినప్పటికీ, ఇది పలు గోప్యతా సమస్యలను కూడా లేవనెత్తింది. బ్రిటన్ తన వ్యవస్థలో బయోమెట్రిక్ డేటాను చేర్చదు, అలాగే డేటా భద్రతపై ఎక్కువ దృష్టి పెడుతుందని బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు.
ఉద్యోగం గుర్తించడానికి, అర్హులు ప్రభుత్వ సహాయం పొందడం, ప్రజల రోజువారీ జీవితాన్ని సులభతరం చేయడానికి డిజిటల్ గుర్తింపులను కోరుకుంటున్నామని స్టార్మర్ పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని ప్రకటన తర్వాత కూడా వాళ్ల దేశంలో ప్రజల ఆందోళనలు పూర్తిగా తగ్గలేదు. ఏదేమైనా ఈ మొత్తం విషయం నుంచి ఒకటి మాత్రం స్పష్టం అవుతుంది.. అదే భారతదేశ ఆధార్ నమూనా ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. అయితే ప్రతి దేశం దాని అవసరాలు, సవాళ్లను దృష్టిలో ఉంచుకుని భారత ఆధార్ వ్యవస్థను వాటికి అనుగుణంగా స్వీకరించాలని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Test-20: క్రికెట్‌లో నయా ఫార్మాట్.. టెస్ట్- 20 ఫార్మాట్ రూల్స్ ఏంటి..?