Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నికమ్.
- ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ఆదేశాలు.
- నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal murder case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది, ముంబై దాడుల కేసులో ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్ష పడేలా వాదించిన ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రభుత్వం నియమించింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధితు కుటుంబానికి ఈ హామీ ఇచ్చారు. శుక్రవారం కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ సీఎంను కలిసి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఫడ్నవీస్ హామీ ఇచ్చారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, 26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన ఉజ్వల్ నికమ్‌ను నియమించాలని కుటుంబం చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఈకేసు వాదించడానికి ఉజ్వల్ నికమ్ కూడా అంగీకరించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. దీంతో పాటు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని న్యాయ, శాసన శాఖ కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
పూణేకు చెందిన కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ చేసి, కేతన్‌ను లోహ్‌గఢ్ కోట పైనుంచి లోయలోకి తోసి చంపేశారు. ఈ ఘటనను ముందుగా ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, చివరకు కేతన్ కుటుంబ సభ్యుల అనుమానాలతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. జూన్ 14న లోహ్‌గఢ్ కోటకు తీసుకెళ్లి కేతన్‌ను చంపేందుకు విఫలయత్నం చేసింది. ప్లాన్ విఫలం కావడంతో జూన్ 18న మరోసారి అదే ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు తేలింది.
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్‌తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!